పిల్లల మనస్తత్వం బహు వింత గా విచిత్రంగా ఉంటుంది. తమ దగ్గర ఉన్న వస్తువుతో కాసేపు ఆడి ఆపై పక్కవాడి బొమ్మల కోసం ఏడ్పు మొదలు పెడ్తారు.ఇది ఓచిన్నారి రాకుమారుడి మొండి పట్టుదల! వాడి దగ్గర రకరకాల వింత విలువైన ఖరీదైన ఆటబొమ్మలు చాలా ఉన్నాయి.రోజూ ఓకొత్త వస్తువు కావాలి వాడికి. ఆరోజు ఓదాసికొడుకు మట్టిబొమ్మతో ఆడుతున్నాడు.దాన్ని చూస్తూనే రాకుమారుడు పెద్దగా ఏడ్పు లంకించుకున్నాడు"నాకు ఆబొమ్మ కావాలి"అంటూ!"ఛ..ఛ! అది ఉట్టి మట్టిది.రంగు వెలిసిపోయింది.దాని కాళ్లు విరిగాయి.చేతికి మట్టి అంటుతుంది.నీటిలో పడేస్తే కరిగి కన్పడకుండాపోతుంది."అంటూ దాసీ ఓదారుస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే దూరం గా ఉన్న ఇంకో దాసికొడుకు మట్టి బొమ్మలతో ఆడేవాడు రాకుమారుడి ఏడ్పు కి తిరిగి చూశాడు. అంతే! ఖరీదైన అందమైన రంగుల బొమ్మలని చూడగానే వాడు పెద్దగా ఏడ్పు లంకించుకున్నాడు"అమ్మా!నాకు ఆబొమ్మలు కావాలీ" అని నేలపై దొర్లుతూ ఏడ్వసాగాడు."ఒరే కన్నా!నీకు వాటితో ఆడే తాహతు అధికారం లేదురా!" తల్లి ఓదారుస్తూనే ఉంది. కానీ వాడిచెవికి ఎక్కటంలేదు.ఆఇద్దరు పిల్లల ఏడ్పు విన్న పెద్ద దాసీ వచ్చి కారణం అడిగి తెలుసుకుంది."పిల్లల మనస్తత్వానికి తగ్గట్లు మనం నడవాలి. రాకుమారుడు దాసీపుత్రుడు అనే తేడా భేదాలు పిల్లల కి ఉండవు"అని అంటూ మట్టి బొమ్మలని రాకుమారుడికి అతని విలువైన బొమ్మలని దాసీపుత్రుడికి ఇచ్చింది.ఓఅరగంట ఆడగానే వారి మోజు తీరింది. కాసేపు పిల్లలు ఇద్దరినీ కలిపి ఆడించింది.అంతే హాయిగా కేరింతలు కొడుతూ ఆడుకున్నారు."చూశారా!వీరిద్దరూ ఏడ్పు ఆపకపోతే రాణీగారి దాకా ఆవార్త వెళ్లి అనవసరంగా మాటలు పడాల్సి వచ్చేది."నిజమే మరి! పసివారికి పేద గొప్ప రాజు బంటు అనే తేడా ఉండదు. ప్రభుత్వ బడులలో అంతా సమానమే! ప్రైవేటు బడులలో యూనిఫాం పెట్టడంలో ఉద్దేశం కూడా అదేసుమా🌷
పసిమనసులు! అచ్యుతుని రాజ్యశ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి