:-*ముద్దొచ్చే..! *(బాలగేయం ) కోరాడ నరసింహా రావు.
 ముద్దొచ్చే పిల్లల్లారా... 
   బుద్దిగా మీరు ఉండాలి !
అల్లరి పనులుచేయక.... 
    శ్రద్దగా చదువుకోవాలి !!
తోటి పిల్లలతో  కలిసి.... 
    మెలిసి స్నేహంగా ఉండాలి !
చేతనైనంత సహాయం.... 
    ఇతరులకుమన0చెయ్యాలి !
ఆటల్లో, చదువుల్లో .... 
         మేటిగా మీరు నిలవాలి !
పెద్దలనెపుడూ గౌరవిస్తూ... 
    క్రమశిక్షణతో మెలగాలి !!
చెడ్డవారిని వీడాలి... 
      మంచివారితో కూడాలి !
సమయాన్నెపుడూ...
                     వృధాచేయక 
గ్రంధాలయముకు వెళ్ళాలి !
దేశముపట్ల, దైవముపట్ల... 
           భక్తి, శ్రద్ధలు ఉండాలి !
మీరు ఉత్తమ పౌరులుగా... 
      దేశానికే ఖ్యాతిని తేవాలి !!
ముద్దొచ్చే పిల్లలారా... 
        బుద్దిగా మీరు ఉండాలి !
అల్లరిపనులు చేయక మీరు 
       శ్రద్దగా చదువు కోవాలి !!
    ********

కామెంట్‌లు