సుప్రభాత కవిత ; -బృంద
శిలలకు తెలుసు
అలలెన్ని ప్రయత్నాలు చేసాయో

అందని ఆకాశం అందుకుందామనీ..

పొందని ఆనందం పొందాలనీ...

మదిలో పొంగిన సంతోషాలన్నీ...

ఎదను దాచిన సొదలన్నీ....

తీరని కోరికల దొంతరలన్నీ..

మాయని మమతల  బంధాలన్నీ

చెప్పిన చక్కని కబురులన్నీ...

దించుకున్న గుండె బరువులన్నీ.

చేరని తీరాల స్నేహాలన్నీ...

దాచిన  బడబానలాలన్నీ....

దాగిన మేలిమి ముత్యాల వివరాలన్నీ

శిలలకు మాత్రమే తెలుసు
అలల  ఆరాటం.....
మనసుకు మాత్రమే తెలుసు
తలపుల పోరాటం..

గెలవని కెరటాలు
మాయని తలపులు
వీడని బంధాలు
వాడని మమతలు...

అంతులేని వింతల  అగాధం సంద్రం
మాయని తలపుల మనసు...చందం

ఊహల తీరం చేరే ఊపిరినిచ్చే
ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు