మా బామ్మ ఎంతో మంచిది
నన్నెంతో ప్రేమతో చూస్తుంది
తాయితాలెన్నో పెడుతుంది
మా అమ్మ తిడితేను
నన్ను బుజ్జగిస్తుంది
మా నాన్న కొడితేను
నన్ను ఊరడిస్తుంది
మా అన్న దెబ్బలాడితేను
అన్నను కోప్పడుతుంది
మా అక్క దెబ్బలాడితేను
అక్కను కోప్పడుతుంది
మా చెల్లి దెబ్బలాడితేను
నన్ను ఊరుకోమంటుంది
మా తమ్ముడు దెబ్బలాడితేను
తమ్ముడిని ముద్దుచేస్తుంది
మా బామ్మ ఎంతో మంచిది !!
బామ్మ ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి