*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0144)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దండకారణ్యం - రాముడు - శివుడు నమస్కరించుట - సతీదేవి శ్రీరాముని పరీక్ష చేయుట*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*సీతగా వచ్చి తన ఎదుట నిలిచిన సతీదేవి ని గుర్తించిన రఘువంశసోముడు, సతీదేవి తో.. "అమ్మా జగన్మాత! నా నమస్కారాలు అందుకో. పరాత్పరుడు అయిన శివునితో కూడి రావలసిన నీవు ఒంటరిగా వచ్చా వేమిటి తల్లీ! నిరంజనుడు, నిరామయుడు అయిన సదాశివుడు ఎక్కడికి వెళ్ళాడు. ఉమగా వుండవలసిన నీవు, కొత్తగా ఈ సీతగా కనిపిస్తున్నవు, ఎందువలన" అని తన సందేహం తీర్చమని వేడుకున్నాడు.*
*శ్రీరాముని మాటలు విన్న సతీదేవి అత్యంత ఆశ్చర్య పడుతూ, శివభగవానుడు తనతో రాముని గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఆనందమయ శివునికి మనసులోనే నమస్కరించి, రామచంద్రుని తో.... "రామా! మేము ఇద్దరమూ, శివ పరివారముతో కలసి సర్వ జగత్తునూ పరిభ్రమిస్తూ, ఈ దండకారణ్యానికి వచ్చాము. మేము చూసినప్పుడు లక్ష్మణుడు, నీవు దీన వదనాలతో, ధనుర్బాణాలు ధరించి సీతాన్వేషణలో వున్నారు. ఆ స్థితిలో మిమ్మల్ని చూచిన శివ భగవానుడు మీకు నమస్కరించి ముందుకు కదిలారు. నాలుగు చేతులతో, శంఖు, చక్రాలతో మీరు లేకపోయినా మీ విష్ణు తత్వాన్ని గుర్తించిన సదాశివుడు ఎంతో పరమానంద భరితమైన సుఖాన్న అనుభవించారు. అది చూచి అనుమాన పడిన నన్ను, నాకు నచ్చిన రీతిలో నీ రీక్ష చేసుకో మన్నారు. నేను సీతమ్మ లా మీ ముందుకు వచ్చాను. నా భ్రమలు తొలగిపోయి, మీరు విష్ణువు అని తెలుసుకున్నాను. ఇప్పుడు భగవంతుడు అయిన శివుడు దగ్గర లో వున్న వట వృక్షం కింద నీ గుణగణాలు కీర్తిస్తున్నాడు. భగవంతుడు, జగత్పతి అయిన శివునికి నీవు వందనీయుడవు ఎలా అయ్యావు? నా సందేహం తీర్చు, దాశరధీ!" 
*సతీదేవి మాటలు విన్న సీతాపతి, రుద్రదేవుని మనసులోనే తలచుకుని, ఆ భగవానుని ప్రార్ధన చేసాడు. తన వద్దకు రమ్మని శివ భగవానుని ఆజ్ఞ లేదు కనుక రాముడు వట వృక్షము దగ్గర వున్న శివుని వద్దకు వెళ్ళ లేదు. శివ భగవానుని తలచుకుని, సతీదేవి సందేహం తీర్చే ప్రయత్నం మొదలు పెట్టాడు, రామచంద్రమూర్తి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు