*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0158)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుని ఇంట సతీదేవి ప్రాణత్యాగం - రుద్రుడు తెలుసుకుని - వీరభద్ర, మహాకాళి ల సృష్టి  - యజ్ఞ ధ్వంసము, వైరి సంహారమునకు ఆజ్ఞ*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
 *ఆకాశవాణి మాటలు విన్న దేవ, కిన్నెర, కింపురుషులు, మహర్షులు, దేవతా సమూహము ఆశ్చర్యంతో, నిశ్చేష్టులుగా ఉండిపోయారు. ఏమీ చేయలేని స్థితిలో వుండి పోయారు. బృగువు సృష్టించిన రుషభుల చేతిలో చనిపోయిన పార్షదులు చనిపోగా మిగిలిన పార్షదులు కైలాసము చేరి, దక్షుని ఇంట జరిగిన వృత్తాంతం అంతా చెప్పి, "మేము ఎంతో భయముతో వుండి మీ వద్దకు వచ్చాము. జరిగినది చెప్పాము. జరుగ వలసినది మీరే చేయాలి" అని ప్రార్థన చేసారు. అప్పుడు రుద్రుడు దేవర్షి అయిన నిన్ను స్మరించారు. *
*రుద్రుడు తలచుకోగానే నీవు కైలాసమునకు వెళ్ళి ఆ దేవదేవుని ముందు కైమోడ్చినప్పుడు, రుద్రుడు నీ ద్వారా దక్షయజ్ఞం లో జరిగిన విషయాలు వినగోరి, తెలుపమని అడిగారు. అప్పుడు, "సర్వరక్షకా! ఆదిదేవా! బ్రహ్మ మానస పుత్రులలో తానే అందరి కంటే గొప్ప అని, అందరికీ ఆరాధ్యుడను తానే అనే గర్వంతో కన్నులు మూసుకు పోయిన దక్షుడు ఒక యజ్ఞం తలపెట్టి, విష్ణుమూర్తి, బ్రహ్మ, మిగిలిన దేవతా సమూహానికి యజ్ఞ భాగం కల్పించాడు కానీ, మీకు ఆహ్వానం పంపలేదు, యజ్ఞ భాగం ఏర్పరచలేదు. పైగా, మిమ్మల్ని అనరాని మాటలతో అనేక మార్లు కించ పరిచాడు. దధీచి, మీ అత్యంత ప్రియ భక్తుని మాటలు కూడా మన్నించ లేదు. తరువాత జగన్మాత సతీదేవి వచ్చి చెప్పినా వినలేదు. క్రోధిత అయిన అంబ యోగాగ్ని లో ప్రాణత్యాగం చేసింది. ఎంతో బాధపడిన పార్షదులు యజ్ఞ భంగం చేయడానికి వెళ్ళగా, భృగువు సృష్టి చేసిన రుభులు వారిని నిలువరించారు. కొంతమంది చనిపోయారు. మిగిలినవారు మీ సన్నిధికి చేరారు." అని నీవు రుద్రునికి చెప్పావు.*
*ఈ వృత్తాంతం విన్న హరుడు కాలరుద్రుడే అయ్యాడు. సతీదేవి ప్రాణత్యాగం విన్న ఆయన కన్నులు అగ్ని గోళాలు అయ్యాయి. సర్వేశ్వరుడు, లోక సంహారకారి అయిన రుద్రుడు తన శిరస్సునుండి ఒక జటను తీసి మిక్కిలి కోపముతో కైలాస పర్వతమునకు విసిరి కొట్టారు. అలా విసిరి వేయబడ్డ జట రేండు భాగాలుగా చీలి పోయింది. ప్రళయాన్ని గుర్తుచేస్తూ భయంకరమైన శబ్దం వినిపించింది.*
 *ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు