బ్రహ్మ, నారద సంవాదంలో.....
*వీరభద్రుడు, భద్రకాళీ దక్ష యజ్ఞ ధ్వంసానికి బయలు దేరడం - దక్షునికి, దేవతలకు అపశకునములు కనపడుట*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*మహేశ్వరుని ఆజ్ఞతో వీరభద్రుడు, భద్రకాళీ శివదేవునికి నమస్కరించి దక్షుని యజ్ఞ నాశనానికి బయలుదేరారు. దక్షుని మీద యుద్ధానికి బయలయదేరిన వీరభద్రుడు ప్రళయకాల రుద్రుని వలే వున్నాడు. ఆయనకు వేయి చేతులు వున్నాయి. శివుడు లాగా ఒళ్ళంతా భస్మము, నడుముకు నాగు పాము చుట్టుకుని, పులి చర్మము ధరించి, చేతిలో అతి పెద్ధదైన శూలముతో కైలాసపతినే తలపిస్తున్నాడు. అతి విశాలమైన వీరభద్రుని రథాన్ని ఎంతో శ్రమతో పదివేల సింహములు లాగుతున్నాయి. ఆ రథానికి, పులులు, మొసళ్ళు, మదించిన ఏనుగులు రక్షణ కవచంలాగా వున్నాయి. ప్రళయాగ్నితో సమానమైన తేజస్సుతో కొన్నివేల మంది శివపార్షదులు వీరభద్రుని రథానికి ముందు వెనుకల వస్తున్నారు.*
*కాళి, కాత్యాయనీ, ఈశానీ, చాముండ, ముండమర్దినీ, భద్రకాళీ, భద్ర, త్వరిత, వైష్ణవి, అను నవదుర్గలతో, సమస్త భూతములతోనూ, భద్రకాళి బయలుదేరింది, దక్ష వినాశనం చేయడానికి. ఢాకినీ, శాకిని, భూత, ప్రమధ, గుహ్యక, కూష్మాండ, పర్పట, చటక, బ్రహ్మరాక్షస, భైరవ, క్షేత్రపాలురు అందరూ కూడా శివభగవానుని పని పూర్తి చేయడానికి భద్రకాళి వెంట కదిలారు. కోట్లాది గణములు, గణాధీశులు, అరువది నాలుగు గణములతో యోగినులు దక్షుని పైకి బయలు దేరారు. ఈ ప్రయాణ సంరంభాన్ని తెలియజేస్తూ, ఆకస వీధిలో భేరులు, తప్పెట్లు, శంఖు నాదాలు, వాద్య ఘోషలు భీకరంగా వినిపిస్తున్నాయి.*
*అక్కడ దక్ష ప్రజాపతి కి అనేక అశుభాలు కనిపిస్తున్నాయి. ఆతని ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ అదిరాయి. ఆకాశంలో మిట్ట మద్యాహ్నం సమయంలో పెద్ద పెద్ద నక్షత్రాలు కనబడ్డాయి. సూర్యమండలము అంతా వెల వెల బోయి కాంతివిహీనంగా కనిపించింది. తారలు తెగి ఆకాశం నుండి కిందకు పడిపోతున్నాయి.*
*ఇంతలో అశరీరవాణి "దక్షా! నీ జన్మ ఈ రోజు ఎందుకు పనికి రాకుండా అవుతుంది. నీవు పరమేశ్వరుని ధిక్కరించావు. పాపాత్ముడవు అయ్యావు. ఇప్పటి నుండి నీ హాహాకారాలు ఎవరికీ వినిబడవు. ఈ యజ్ఞములో నీతో కూర్చున మూర్ఖ దేవతలకు కూడా అనేక కష్టాలు కలుగుతాయి. పరాత్పరుని దండన నుండి నిన్ను ఎవరూ రక్షించలేరు." అని పలికింది. కనిపిస్తున్న దుశ్శకునములు, ఆకాశవాణి మాటలు విన్న తరువాత దక్షునికి, అక్కడ వున సభాసదులు అందరికి జరగబోయే విపత్తును తలుచుకుని బాధ, భయం కలగుతున్నాయి. ఏమి చేయాలో పాలుపోక, వుండిపోయారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి