*ఉత్పలమాల:*
*నీ సహజంబు సాత్త్వికము | నీవిడిపట్టు సుధాపయోధి, ప*
*ద్మాసనుఁడాత్మజుండు గమ | లాలయ నీ ప్రియురాలు నీదు సిం*
*హాసన మిద్ధరిత్రి, గొడు | గాకస, మక్షులు చంద్రభాస్కరుల్*
*నీ సుమతల్ప మా ఫణి | నీవె సమస్తము, గొల్చినట్టి నీ*
*దాసుల భాగ్యమెట్టిదయ | దాశరధీ ! కరుణాపయోనిధీ !*
తా: భద్ర్రాద్రిపై కొలువుండి, కరుణా నిధివైన! దశరధరామా! సాత్వికముగా వుండటం నీ సహజమైన లక్షణం. సముద్రము నీవు వుండే ఇల్లు. పద్మములో కూర్చునే బ్రహ్మ నీ కుమారుడు. కమలములో కూర్చునే లక్ష్మీ దేవి నీ ఇల్లాలు. ఈ భూమి నీ సింహాసనము. ఆకాశము నీకు గొడుగు. సూర్య చంద్రలు నీ కన్నులు. నిన్ను కొలిచే నీ దాసుల భాగ్యము ఎంత గొప్పదో కదా, సర్వాంతర్యామి! .......అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఇంతకు ముందు ఈ "రామ" తత్వం మనకు అర్థం అయ్యేలా చెప్పాలని ఒక వ్యాస భగవానుడు, కవిత్రయం, కబీరుదాసు, ఇలా ఎంతో మంది ప్రయత్నాలు చేసారు. మనకు ఇంకా తేలికగా తెలియాలని "శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు! కళ్యాణ గుణగణుడు కరుణా ఘనా ఘనుడు ఎవడు! అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ! ఆనంద నందనుడు అమృత రసచందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు ! తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము !!" సినీ కవి చెప్పారు. ఎవరు చెప్పారు అని కాకుండా, చెప్పినది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ మనకు అర్థం కాకపోతే, పరమాత్ముడే మనల్ని కాపాడాలి. అలా ఆ పరమేశ్వరుడు కాపాడుతాడని, కాపాడాలని ప్రార్థిస్తూ........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి