*ఉత్పలమాల:*
*సూరిజనుల్ దయాపరులు | సూనృతవాదులు లుబ్ధమానవుల్*
*వీరపతివ్రతాంగనలు | విప్రులు గోవులు వేదముల్ మహీ*
*భారముఁదాల్పఁగా జనులు | పావనమైన పరోపకార స*
*త్కార మెరుంగలే రకట | దాశరధీ ! కరుణాపయోనిధీ !*
తా: భద్ర్రాద్రిపై కొలువుండి, కరుణా నిధివైన! దశరధరామా! పండిత సమూహాలు, దయ కలిగిన వారు, సత్యము మాత్రమే మాట్లాడే వారు, పిసినారి తనము లేనివారు, వీరులైన పతివ్రతలు, బ్రాహ్మణులు, ఆవులు, వేదములు భూమి భారాన్ని మోస్తున్నారు. అయ్యో! సామాన్య మానవులు మాత్రం వీరందరికీ ఏవిధంగా మనము ఉపకారం చేయగలము అనే విషయం తెలుసుకో లేకుండా వున్నారు. ఎంత బాధాకరమో కదా!......అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*మన చుట్టూ ఉన్న ప్రకృతి, సముద్రాలు, అడవులు, కొండలు ఇవి అన్నీ మనకు చేస్తున్న మేలు ఇంత అని చెప్పడం కష్టం. చెట్టు ప్రాణవాయువు ఇవ్వకపోతే మనం ఊపిరి పీల్చుకోలేము, కదా. అలాగే, ప్రకృతి లో దొరుకుతున్న పూలు, పళ్ళు, పాలు, కూరలు, కట్టెలు, ఇలా అన్నీ. కానీ, మనం మొక్కలు పెంచాలి అనే ప్రయత్నం చాలా చాలా తక్కువగా చేస్తాము. రైతన్నకు చేయూత ఇవ్వడం, అది ఒక గగన కుసుమం. ఇలా మనం ఆలోచన చేస్తే మన చుట్టూ వున్న వారికి మనంఎంత రుణపడి వుంటామో, వుండాలో తెలుసుకోవాలి. కొంచెమైనా మన రుణం తీర్చుకునే ఆలోచన మనకు కలిగేలా, మన ఆలోచనలను మార్చమని ఆ దేవదేవుని ప్రార్ధిద్దాము.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి