సమాజంలో వ్యక్తుల మనస్తత్వం ఎలా వుంటుందంటే తన గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం (స్వోత్కర్ష) ఇతరులను గురించి వారిలో ఉన్న చెడును వెతకటం ( రంధ్రాన్వేషణ) అంటారు. ఈ గొప్పలు చెప్పుకునే వాడు సాంప్రదాయ మంటాడు. అవతల ఎవరైనా అర్థవంతమైన శబ్దం సంప్రదాయం అన్నాడు అనుకోండి చూడండి వాడికి భాష రాదు సా రాయాలో స రాయాలో తెలియదు అంటూ ఎగతాళి చేస్తాడు. ఇలాంటి పనికిమాలిన వాడి గురించి చెప్పకనే చెప్పిన అద్భుతమైన వాక్యం త్యాగరాజ స్వామి వారి నోటి నుంచి వెలువడింది. "సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామ" అంకితభావంతో సమాజానికి సేవ చేసే వ్యక్తి యొక్క గుణం ఎంత గొప్పగా ఉంటుందో వాల్మీకి మహర్షి అద్భుతంగా వ్రాసిన రామాయణం. ఆయన ప్రయత్నం కొంచెం అయినా ఫలించిందా అంటే కొంతమంది శివ నాగిరెడ్డి గారు లాంటివాళ్ళు మనకు కనిపిస్తారు కనుక ఫలించినట్లే.
ఆంధ్ర భాషను మర్చిపోతున్న మనకు గుర్తు చేయడం కోసం భాషా సమాఖ్యను ఏర్పాటు చేసి డాక్టర్ జివి పూర్ణచంద్ గారు వారి మిత్రులు గుత్తికొండ సుబ్బారావుతో కలిసి మండలి బుద్ధ ప్రసాద్ గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గార్లతో భాష ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటూ అనేక
సభలలో ఉపన్యాసాలతో ఆంధ్రభాష ప్రయోజనాల గురించి చెప్తూ ఉంటే కొంతమందికైనా తెలుగులోనే మాట్లాడాలి అన్న అభిప్రాయం వస్తుందని ఆశ. ప్రచారం చేయకపోయినా మాతృభాషను మరువలేము మరువకూడదు అన్న సిద్ధాంతంతో శివ నాగి రెడ్డి గారు ఆంధ్ర భాషలోనే మాట్లాడతారు. మేము ఎప్పుడైనా పొరపాటున ఆంగ్ల శబ్దం వాడితే ఏమిటా మాట అని అడుగుతాడు దానికి తోడు మన భాషలో సరైన మాట లేదా అంటారు తప్ప ఏద్దేవా చేయడం కానీ, ఆ భాషలో ఎందుకు మాట్లాడుతున్నారని కానీ అనడం ఆయన నాలుకకు చేతకాదు. డాక్టర్ జివి పూర్ణచంద్ గారు రాసిన ఆహార వేదం గురించి విపులీకరించి చెబుతూ ఇన్ని రుచులను చూపిన పూర్ణ చంద్ లో భాషా పటిమను వారి వ్యక్తిత్వాన్ని సాహితీ ప్రక్రియల పట్ల వారికున్న అవగాహనను అర్థం చేసుకున్న ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు మూడు రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆ
అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ రెడ్డి గారు తెలుగువారి ప్రతి చరిత్రకు, తొలి చరిత్రకు మన దేశ చరిత్రలో విశిష్ట స్థానం ఉందని సోదాహరణంగా నిరూపించిన చరిత్రకారులను మించిపోయారు పూర్ణచంద్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి గా సమగ్ర సాహిత్య మూర్తిగా చరిత్ర, సంస్కృతి శ్రద్ధగా అధ్యయనం చేసిన వారి ప్రతిభకు గౌరవపూర్వక వందనాలు సమర్పిస్తూ తన
పేరుకు తగినట్లుగా పౌర్ణమి చంద్రుని చల్లని వెన్నెలను కురిపిస్తున్న వారి జీవితం ధన్యం అన్నారు. ఇది వారి సంస్కారానికి నిదర్శనం. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మన సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. కనీసం 1-2 మాటలైనా హాస్యోక్తులతో తన అక్కసును వెళ్ల గ్రక్కే వాళ్ళే చాలామంది వున్నారు. అందుకే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి