గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (23);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఒక సాహిత్య కార్యక్రమ  నిర్వాహకులు నన్ను, శ్రీనివాసరెడ్డిని  సన్మానించడానికి  ఆహ్వానించారు మేము వెళ్ళే సరికి దాదాపు హౌస్ ఫుల్  మా తో పాటు మరికొందరు కూడా ఉన్నారు  సభానిర్వహణ కుటుంబరావు  తుర్లపాటి  విజయవాడలో వారికి జరిగిన చివరి సన్మానం అదే  మర్యాదలన్నీ చాలా చక్కగా జరిగాయి శాలువాలు కప్పి జ్ఞాపికలను అందించారు.  అక్కడి విశేషం 15 మంది పెద్ద వాళ్లతో పాటు పదిమంది చిన్నపిల్లలను కూడా సన్మానించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో  మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలు  ఎన్నిక చాలా బాగుంది  ఒక్కొక్కరు వారి అభిప్రాయాలను చెప్పారు చివరగా నన్ను మాట్లాడమన్నారు. తుర్లపాటికి, శ్రీనివాసరెడ్డికి, గోళ్ల నారాయణరావు గారికి శివనాగిరెడ్డి గారికి  అందరికీ ఏదో మూల విజయవాడలో సన్మానాలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా తెలివి కలిగిన పిల్లలను ఎన్నిక చేసి వారికి సన్మానం చేయడం నాకు ఎంతో నచ్చింది. వారిలో బిందు అన్న పాప  భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఏ శ్లోకం ఎక్కడ ఎప్పుడు చెప్పమన్నా అలా చెప్పి దాని అర్థ తాత్పర్యాల తో పాటు ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పగలిగిన అమ్మాయి ఏ శ్లోకంలో, ఏ భాగంలో, ఏ పాదం చెప్పినా ఆ శ్లోకం మొత్తం చెప్పగలిగిన దిట్ట. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల లోనే కాక అమెరికా లాంటి ఇతర దేశాలలో కూడా తన ప్రజ్ఞాపాటవాలను చూపి  భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేసినది. సభా ముఖంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను స్త్రీ ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు కనుక వారికి ఒక మనవి  మీరు మీ పిల్లలకు బిందుని ఉదహరిస్తూ గీతలో 1-2 శ్లోకాలు చెప్పండి మిగిలిన శ్లోకాలు వారే చదువుతారు ఆ ఒక్క సహాయం స్త్రీ చేస్తే సమాజం ఎంతో పురోగమిస్తుంది. ప్రపంచానికే ఆదర్శప్రాయమైన గీత  చిన్న వయసులో వారికి అవగాహన అయితే వారందరూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ద పడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు  అంటూ మిగిలిన బాల సన్మానితులు కూడా  ఎంత శక్తిమంతులో  చెప్పేసరికి  శివ నాగ రెడ్డి గారు  సాహిత్య సాంస్కృతిక రంగాల్లోనే ఆనంద్ గారు నిష్ణాతులు అనుకున్నాను. ఇంతమందిమి మనముండగా పిల్లల గురించి  అందరి విషయాలు కూలంకషంగా చెప్పి  ఇక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞాపన కూడా చేసిన మంచి పరిశీలకులు అని ఇప్పుడే తెలిసింది  అలాంటి వారికి సన్మానం జరగడం అంటే మా అందరికీ జరిగినట్లే  ఆనందిస్తున్నామన్నారు  సుగుణములే చెప్పుకుంటే సుందర రఘురామ అని త్యాగరాజు స్వామి చెప్పిన కీర్తన నాకు జ్ఞాపకం వచ్చి  కన్నుల వెంట నీరు కారడం  తన గురించి కాకుండా ఎదుటివారిని గురించి ఎవరిలో ఉన్న మంచిని గుర్తించే  ఉన్నత సంస్కారవంతుడు  మా శివనాగిరెడ్డి  అందుకే వారు మనందరికీ ఆత్మీయులు.


కామెంట్‌లు