గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (25);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇవాళ అధ్యాపకులు ఎలా ఉన్నారంటే విద్యార్థిని ఏదైనా ప్రశ్న వేసి వారు సమాధానం చెప్పలేకపోతే వాడిని ప్రపంచానికి వెలుగు చూపిన బుద్ధభగవానుని పేరుతో వీడు  శుద్ధ బుద్ధ అవతారము అని అంటాడు. నిజానికి  ఆ ఉపాధ్యాయుడికి  బుద్ధుడు ఎవరో తెలుసా? మానవ మేధస్సుల కూడిక ప్రపంచంలో ఉన్న మానవ మేధస్సులను కలిపి కుప్పగా పోస్తే అది బుద్ధ అవతారం. దశావతారాలలో బుద్ధుని పేరు తప్పకుండా వుంటుంది. దానిని అర్థం చేసుకునే వ్యక్తులు చాలా తక్కువ ఆంధ్ర ఆంగ్ల సంస్కృత భాషల్లో  ఉన్నత చదువులు చదివిన వారికి కూడా అర్థం కానంత లోతుగా  ఉంటుంది బుద్ధుని యొక్క సిద్ధాంతం  భగవత్ స్వరూపమైన భగవంతుని బుద్ధ భగవానునిడిగా  ఆచరిస్తూ, అనుసరిస్తున్న వారికి కూడా ఎంతమందికి అవగాహన ఉంది. శబ్దాలను తెలుసుకోవడం కాదు దానిని జీవితంలో అనుసంధానం చేసి అనుసరించాలి కూడా
అప్పుడే భగవాన్ బుద్ధ బుద్ధి సంతోషిస్తుంది. అహంకార మమకారాలతో కూడిన గొప్ప గొప్ప పండితులు కూడా బౌద్ధ మత సిద్ధాంతాలను చదివినా అర్థం చేసుకోలేని వ్యక్తులు వారిని గురించి వ్రాయడం దురదృష్టకరం. ఉదాహరణకు విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆంధ్ర దేశానికి ప్రథమ జ్ఞానపీఠాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు. దానిని తెచ్చాను అన్న అహంకారం ఉన్నదా? లేక నా మేధస్సును గుర్తించారు అన్న  ఆలోచన ఉన్నదా? ఆయనకు వున్నదే అహంకారం తమ గురువులైన తిరుపతి వేంకట కవుల ద్వారా తనలాగా విద్యాభ్యాసం చేసిన వారు మాత్రమే కవులు  మిగిలినవారు కలం పట్టడానికి కూడా వీలు లేదు అన్న అహంభావంతో వారానికి ఒక భాష చొప్పున పట్టుబట్టి 18 భాషలు నేర్చుకున్న  ఓ పల్లెటూరు సిరివాడ వాస్తవ్యులు వేలూరి శివరామ శాస్త్రి గారు ఎందుకూ కొరగాని వ్యక్తి సాహిత్యంలో అనగలిగిన  దురహంకారి. అలాంటి వానికి బుద్ధుడు అర్థం అవుతాడా? వారు చెప్పిన ధర్మ సూత్రాలు వంట పడతాయా?  సనాతనము అన్న  మూఢత్వం మూర్తిభవించిన ఆ బరి దాటని వారికి మంచిని చేయాలి అన్న అభిప్రాయం వస్తుందా?  తాను చెప్పిందే వేదం తాను తప్ప మరెవరూ చెప్పకూడదు అన్న అహంకారం ఉన్న వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ మంచి చెప్పినా చెవికి ఎక్కదు. అలాంటి వారు బుద్ధుని గురించి విమర్శన వ్యాఖ్యతో  గొప్ప కావ్యాన్ని వ్రాశారు అని విర్రవీగడం వల్ల  ఎంతమంది చదువరులకు ఆయన విరోధి అయ్యారో ఆయనకు తెలియదు. వాల్మీకి మహర్షిని అద్భుతంగా అధ్యయనం చేసిన విశ్వనాథ వారునామ రూప రహితమే జీవితము  అన్న వాక్యాన్ని చదవలేదా ? బుద్ధుడు చెప్పినది ఏమిటి అహంకారాన్ని వదిలించుకోవాలి అంటే ముందు ముండనం (బోడి గుండు) చేయాలి ఆహార్యం మీద ఎలాంటి మమకారం ఉండకూడదు కనుక కషాయాన్నే ధరించండి. ఆ రంగు శాంతికి ప్రతీక మీ పేరుకు మీరు బానిసలు కావద్దు అని చెప్పిన వాక్యాలు  ఆయన చదివితే ఇంత ఘోరమైన పుస్తకాన్ని వెలువరించగలడా? దయ కరుణ అన్నవి రెండు ఆయుధాలు నవరసాలు ప్రత్యేకంగా లేవు ఉన్నది కరుణరసం అని చెప్పిన మహానుభావుని గురించివీరు వినలేదా? కరుణ అంటే ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడం అని అర్థం  అంతే తప్ప దయాదాక్షిణ్యాలన్న మాటలు లేవు తెలివి విపరీతంగా పెరిగిన తర్వాత వికటించి ఆంగ్లంలో పర్వర్షన్ అనే శబ్దం ఉంది ఆ తత్త్వం అలవడుతుంది అనడానికి ఈయన ప్రత్యక్ష సాక్షి. అలాంటి వారి రచనలు చదవడం కానీ , వారి గురించి మాట్లాడుకోవడం కానీ మనకు మంచిది కాదు అని మా శివ నాగి రెడ్డి గారితో చెపితే ఎవరి అజ్ఞానం వారికి ఉంటుంది వారి గురించి మనకు ఎందుకు సార్ అని నవ్వుతారు అంత సాత్విక మూర్తి మాకు మిత్రుడు కావడం చాలా ఆనందం.


కామెంట్‌లు