ఒకరోజు రెడ్డి గారి కార్యాలయంలో సరదాగా కాలక్షేపం చేస్తున్న సందర్భంగా నా అజ్ఞానాన్ని ప్రకటించడం కోసం ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన విషయాలను మాట్లాడటం మొదలుపెట్టాను నాటకాలు షేక్స్పియర్ రాసినట్లుగా ఎవరు రాస్తారు. పద్య కావ్యాలు సృష్టించడంలో జాన్ మిల్టన్ ను ఎవరైనా మరిపించగలరా అంటూనే ఉన్నాను మధ్యలో రెడ్డిగారు అందుకని ఆనంద్ జీ ఆయన నాటకాలు అంత గొప్పగా ఉండడానికి కారణం ఆలోచించారా అంటే దానికి ఆలోచన ఎందుకండీ! తన జీవిత అనుభవాలతో రాసినది ఒక్కొక్కటి ఒక్కొక్క మాణిక్యం అంటే, కాదనను కానీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియకుండా ఆ మానసిక విశ్లేషణ ఆ నాటకాలలో ఎలా పొందుపరిచాడు అన్నది నా ప్రశ్న అనగానే తెల్లమొహం వేయడం తప్ప చేసేది ఏమంటుంది వారు మూలానికి వెళ్లి అసలు కథ కాళిదాసు రాసిన అసలు నాటకం రెంటిని చెబుతూ ఉంటే నేను ఈ వ్యాఖ్య ఇంత వరకు వినలేదే అనడం తప్ప మరో మాటకు ఆస్కారం లేదు. నేను చెబుతునప్పుడే ఆయన తెల్ల కాగితం మీద ఏదో రావడం చూసి ఈయన బాంబు పేల్చేలా ఉన్నారు అనుకున్నాను మనసులో. అలాగే చేశారు ఈ కాగితం చూడండి అంటే దానిలో శ్లోకం దాని అర్థం చదివిన తర్వాత నేను చెప్పిన దానిని గురించి ఉదహరించారు. జీవితం ఎలాంటిదో చెబుతూ మిల్టన్ చెప్పిన మాట టు లాగ్స్ ఆన్ ద సి రెండు దుంగలు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఆ వేగంలో రెండు ఒకసారి కలిసి విడిపోయినట్లు మన జీవితం ఉంటుంది అని ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం. ఉపనిషత్తులు ముందా? మిల్టన్ ముందా? చరిత్ర తెలిస్తే సమాధానం చెప్పండి అని వివేకానందను ఉదహరిస్తూ రెడ్డి గారు చెప్పినది ప్రతి హిందువు జ్ఞాపకం పెట్టుకోవలసిన వాక్యం ప్రపంచంలో ఏ మూలనైనా సరే ఏ ఒక్క సూక్తి వినిపించినా అది భారతదేశం నుంచి వెళ్ళినది అని. ఏదైనా మనం వ్యాఖ్య చేసేటప్పుడు మూలాలను పరిశీలించి ఎక్కడ నుంచి ఎలా వచ్చింది దానిని మనం మన పద్ధతిలో ఎలా చెప్ప వచ్చును అని ఆలోచిస్తారు ఎవరైనా అంతమాత్రం చేత భారతదేశంలో వెలువడిన ఈ గ్రంథాన్ని చదివే వారని నేను అనడం లేదు. ప్రపంచంలో ఉన్న మేధావులు అందరికీ ఒకే రకమైన ఆలోచన ఉంటుంది అని నేను చదివాను సమాజ హితం కోసమే వాళ్ళు కావ్యాలను నిర్మిస్తారు తప్ప వారి ప్రయోజనానికి కాదు అన్నది నాకు తెలుసు అన్న రెడ్డి గారు సంస్కారానికి రెండు చేతులూ ఎత్తి నమస్కరించి తీరవలసినదే. నాకున్న అలవాటు ఏమిటంటే మనసులో ఏది ఉందో దాచుకోకుండా చెప్పి రెడ్డి గారి లాంటి వారు విషయం తెలిసినవారు దానిని సరి చేస్తే ఆ ఒప్పును స్వీకరించి ఆచరించాలి అనుకోవడం.
ఇప్పుడు వారు రాసిన కాగితం మీరు చదవండి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి