అమ్మ ఆలనా;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 దివంగత  సినీ నటుడు  కృష్ణం రాజు గారు బడికి ఒకటవ తరగతి లోనే గుర్రం బండి మీద వెళ్ళేవారు. ఉన్నత కుటుంబంలో జన్మించిన వారు కనక వారి తండ్రిని కలవడానికి చాలా మంది వస్తూ ఉండేవారు  ఉదయాన్నే వచ్చిన వారిని  బూతులు తిట్టి మా నాన్నగారు పడుకున్నారు మీరు రావద్దు  అంటూ కోపగించుకునే వారు. అలాంటి వాళ్లు పెరిగి పెద్దవాడై  సామాజిక స్పృహతో ఎన్ని గుప్తదానాలు చేశారు  ఎంతమంది జీవితాలను నిలబెట్టాడు. ఎంత మర్యాదగా ప్రవర్తిస్తాడు అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ నాన్నగారు  వీరిలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు అని చెబుతూ ఉంటారు. అలా తయారు కావడానికి కారణం ఎవరు పిల్లలకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి. అది  మంచిదా చెడ్డదా అన్న ఆలోచన ఎవరికి వుంటాయి  తల్లిదండ్రులకు చిన్నతనం నుంచే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు వాళ్ళ ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో పరిశీలించండి  మంచిని మరింతగా పెంచండి చెడు ఉంటే దానిని అంకురం లోనే  తుడిచి పెట్టండి. అప్పుడు మీరు అనుకున్న పద్ధతిలో పిల్లలు క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా పెరుగుతారు. వాడికి కొంచెం డబ్బులు ఇచ్చి చూడండి ఎలా వాడతారో గమనించండి  దుబారా చేస్తున్నాడా?  పొదుపు చేస్తున్నాడా?  గమనించండి. నిజానికి పిల్లల్లో ఉన్న గుణం, ఖర్చు చేసే విధంగా పెద్దలు ఇచ్చిన డబ్బును దాయడం. నా దగ్గర ఇంత ఉంది, అంత ఉంది అని  ఇలా చెప్పుకోవడం తన స్నేహితులతో కూడా నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో  అని డాంబికాలు పలకడం అలవాటు  వారి ప్రవర్తన గమనించి వారిని తీర్చిదిద్దాలి.  వారిలో రెండు రకాల మనస్తత్వాలు వుంటాయి.  ఒక రకం అవసరాల గురించి ఖర్చు చేయకుండా  తన స్థితిని తెలుసుకొని  దాన్ని సక్రమంగా వాడుతూ ఉంటారు మరి కొంతమంది ఇంకొక రకంగా ఆలోచిస్తారు  అవతలి వాడు పది రూపాయలు పెట్టి ఏదైనా అవసరమైన వస్తువులు కొంటే  ఇతను ఇరవై రూపాయలు  పెట్టి దానికన్నా అందమైనది, ఆకర్షణీయమైనది కొనడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కూడా వారికి  తల్లిదండ్రులే మార్గదర్శకులు  అసలు నిజానికి మొదటి గురువు పిల్లలకు ఎవరు అమ్మ నాన్న. అనుక్షణం పరిశీలిస్తూ ఉండేది అమ్మ  పిల్లలకు ఏ అవసరం ఉంటుందో  దానిని అందించేది, చదువు సంధ్యల వైపు  మనసుని తిప్పేది అమ్మ  అందుకే ప్రథమ గురువు తల్లి  మొదటి నమస్కారం ఆమెకి చేయాలి అని మన పెద్దలు చెబుతారు. దానితో పిల్లలలో వినయవిధేయతలు పెరుగుతాయి.


కామెంట్‌లు