.స్వతంత్ర భారతం అంథోల్ పుష్పలీల రేవతి-చర వాణి....8790958751
 ప్రక్రియ.... సున్నితం
=====================
విదేశీయుల హస్తగతమైన  స్వదేశం
అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం
అంతరించిపోయే అఖండ భారతం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కలబోసిన భిన్నత్వంలో ఏకత్వం
మానవ హక్కులు పదిలం
భాద్యతలు మరువద్దని జాగృతం
చూడచక్కని తెలుగు సున్నితంబు

స్వతంత్ర న్యాయవ్యవస్థ పటిష్టం
సమసమాజ నిర్మాణమే ప్రధానం
ప్రజాస్వామ్య విధానమే అనుసరణీయం
చూడచక్కని తెలుగు సున్నితంబు

సాధించిన విజయం ఘనమే
ఇంకా సాధించాల్సినది మనమే
జూచి మెచ్చాలి జగమే
చూడచక్కని తెలుగు సున్నితంబు

భరతమాతను నిత్యంపూజిద్దాం
జవానులకు వందనం అర్పిద్దాం
అన్నదాతలను కరువులో ఆదుకుందాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు