బాలపంచపదులు==============1. మైళ్ళకొద్దీ తిరిగే శ్రమజీవి!సుధా బిందు ఆస్వాద జీవి!పట్టుదలతో తేనె పట్టు జీవి!పట్టింది పంచే ఆదర్శ జీవి!తేనెటీగ ,బతుకు సార్ధకం, రామా!2. భ్రమరమా సంభ్రమమా!విహారమా వినోదమా!ఝంకారాల చలనమా!సంగీతాల సంచలనమా!తేనెటీగ,బతుకు సార్ధకం, రామా!3. పద్మ బంధువు తుమ్మెద!ఆప్యాయంగా వాలి యెద!శ్రద్ధగా వింటుంది యెదసొద!ప్రేమ ఆదర్శం వారే కదా!తేనెటీగ ,బతుకు సార్ధకం, రామా!4. తూనీగా తూనీగా పాట!వినపడుతుంది ప్రతి నోట!అది నిజంగా తేనెల ఊట!తూనీగై ఎగరాలి ప్రతిపూట!తేనెటీగ,బతుకు సార్ధకం, రామా!5. కందిరీగ నిన్ను కుట్టు!తేనెటీగ నీకు తేనె పెట్టు!నీవు బతుకు పంచి పెట్టు!అదే ఎదిగే సరి మెట్టు!తేనెటీగ ,బ్రతుకు సార్థకం ,రామా!6. చెట్టుపై ఉండు తేనె పట్టు!మనిషి చక్కగా ఒడిసిపట్టు!తేనెటీగలు మరి పరిగెట్టు!మనిషి తేనె మూటలు కట్టు!తేనెటీగ ,బతుకు సార్ధకం రామా!7. మనిషి బతుకు స్వార్థం!స్వార్థంతో బతుకు వ్యర్థం!తేనెటీగ బతుకు పరమార్ధం!పరమార్థమే బతుకు అర్ధం!తేనెటీగ,బ్రతుకు సార్థకం, రామా!_________
బతుకు సార్ధకమే!; డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి