నడ మంత్రపు సిరి;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సుంకర సత్యనారాయణ గారు, వాసి రెడ్డి భాస్కర్ రావు గారు కలిసి జంట కవుల్లాగా జంట నాటకాలను రాస్తూ ఉంటారు.  భాస్కర్ రావు గారు జమీందారి వేషం సంభాషణలను చెప్తే  సుంకర గారు  ప్రజల పక్షం వహించి వారి మాటలు చెప్తూ ఉంటాడు. ఇద్దరూ వామపక్ష సిద్ధాంతాలను నమ్మిన వారు నిజాయితీగా అనుసరిస్తున్న వారు నాటకాల ద్వారా, బుర్ర కథ ద్వారా పాటల ద్వారా సమాజాన్ని మార్చవచ్చు అన్న అభిప్రాయంతో అనేక నాటకాలను బుర్ర కథలను గేయాలను రాసి విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా ప్రచురించి ప్రతి పల్లెలోనూ ఈ నాటకాలను వేసేవాడు. ఆ నటీనటులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేవి వారి నాటకం ప్రదర్శించని గ్రామం లేదు అంటే అతిశయోక్తి లేదు.  ఇతర భాషలలో కూడా ఈ నాటకాలు కొన్ని అనువదించబడ్డాయి. ఆ జంట రచయితలు సామాన్య వ్యక్తిని గురించి మాట్లాడుతూ అతని దగ్గర వారసుడు ఎవరైనా  చనిపోయి అతని ఆస్తి  ఇతనికి వస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుంది  ఆ తత్వం మొత్తాన్ని వివరించి చివరిలో  నరము మీద కురుపు అని ఎంతో అందంగా చెప్పారు. మనిషికి కురుపులు రావడం సహజం 4-5 రోజులలో తగ్గిపోతాయి కానీ ఈ నరం మీద లేచిన చిన్న కురుపు  విపరీతమైన బాధ కలిగిస్తుంది శరీరానికి  ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం  అలాగే వేమన మహాశయుడు  అనుకోని ముదనష్టపు ఆస్తి కలిసివచ్చినా, ఏ లాటరీ లోనో లక్షలకు లక్షలు వచ్చినా  అంతకు ముందు తాను బీదరికంలో అనుభవించిన కష్టాలను అన్నిటిని  మర్చిపోయి  చివరకు పేదరికాన్ని మర్చిపోయి
ఎదుటి మనుషులను ఎలా చూస్తాడో. కన్నులకు కట్టినట్లుగా అభివర్ణించాడు  తన ఆటవెలది పద్యంలో.
అతని తత్వం మొత్తం మారిపోతుంది స్నేహితులు, బంధువులు ఎవరిని చేరనివ్వడు  అంత వరకు మంచి పేరు తెచ్చుకున్న వారిని  తూలనడడం చేస్తూ మానసికంగా హింసిస్తూ ఉండడం అతని పని సుంకర వాళ్ళు చెప్పినట్లు నరం మీద కురుపు ఎంత బాధ పెడుతుందో దానికి వందరెట్లు ఈ మానసిక వత్తిడి ఎక్కువగా ఉంటుంది అది భరించడం కూడా చాలా కష్టం.
సున్నితమైన మనసు కలిగిన వ్యక్తులు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడింది  ఈ నడమంత్రపు సిరి వచ్చిన వారికి ఇవేమీ పట్టవు ఒంటెద్దు పోకడ. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో వారి మాటలు ఎలాంటివో వాటిని వర్ణిస్తూ అలాంటి నీచ స్థితికి మీరు రావద్దు అని మనకు చెప్పిన పద్యం ఒకసారి మీరు చదవండి.

"అల్పుడైన వానికి యధిక  భాగ్యము గల్గ 
దొడ్డ వారిదిట్టి తోలగొట్టు  అల్పజాతి ముప్పె యధికుల నెరుగునా..."


కామెంట్‌లు