మనిషి ఆశాజీవి ఆశ లేని వాడికి జీవితం నరక ప్రాయం
కానీ ఆశను వదులుకోమని మన పెద్ద వాళ్ళు అంతా చెబుతారు. బుద్ధ భగవాన్ ని తీసుకున్నా, శంకరాచార్య చెప్పినా గరికపాటి వారి ఉపన్యాసం విన్నా చాగంటి వారు సాత్వికంగా చెప్పినా దాని జోలికి వెళ్ళవద్దు అని. జీవితంలో అన్నీ ఉంటాయి ఉప్పుకారం తింటున్న ఈ నాలుకకు అది లేకపోతే ముద్ద దిగదు అంటారు వాడు ఒట్టి ఆశపోతురా అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎలాంటి వాళ్లనయితే అలా అంటారు మన వాళ్ళు అని ఒక్కసారి ఆలోచించండి. వాడిది కాని వస్తువును ఆశించేవాడు తనకు సంబంధం లేని ఆస్తిపాస్తులు రావాలనుకునేవారు. తనకు సంబంధం లేని సిరి సంపదల కోసం పరితపించే వాడు నేనొక్కడినే సుఖంగా ఉండాలి మిగిలిన వారి సుఖం నాకు అనవసరం అనుకునే వ్యక్తి గురించి మన వాళ్ళు చెప్పిన మాట ఇది నిజమే
కాదనలేము. మానవునిలో అంతర్గతముగా వున్న అరిషడ్వర్గాలు కామము, క్రోధము, లోభము,మోహము, మదము, మాత్సర్యము వీటన్నిటికీ మూలం ఏది కోరిక అది ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ కోరికకు అడ్డూ అదుపు ఉండదు ఇది ఒక్కటే కావాలి అది ఒక్కటే కావాలి అన్న నియమం ఉండదు కోరికలు అనంతాలు వనరులు తక్కువ. అక్కడ కొంచెం ఉంటే మరి కొంచెం కోరితే ఎక్కడినుంచి వస్తుంది ఆ కోరిక తీరదు అప్పుడు క్రోధం పెరుగుతుంది. ఆక్రోశం పెరిగినప్పుడు ఆ ఉద్రేకం లోనూ ఉద్వేగం లోనూ చేయరాని పని చేస్తూ ఉంటాడు. దాని వల్ల ఫలితం చెడు దానివల్ల లోభం పెరుగుతుంది. మాత్సర్యం ఉన్నవాడికి ప్రపంచంలో మొత్తం తనలాగానే కనిపిస్తారు కామెర్ల కంటికి ప్రతిదీ పచ్చగానే కనిపిస్తుంది అనేది నానుడి కామమును వదలి కామక్రోధ ములచే అగ్నిని చలర్చుకొని ఇంద్రియ నిగ్రహము కలిగి బ్రహ్మచర్యము తో ఈ దేహాన్ని, ప్రాణాన్ని ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఆ స్వరూపం కోసం ప్రయత్నం చేస్తూ, ఆ పరమాత్మని తెలుసుకోగలిగిన మహా యోగి పుంగవుడు ఎవరు ఉంటారో వారు ధన్యులు. ఆ రహస్యాన్ని తెలుసుకున్న మహానుభావులు స్థిరత్వం కలిగినటువంటి వారు మాత్రమే. పరిపూర్ణమైన యోగి పుంగవుడు అని వేమన యోగి మనస్ఫూర్తిగా చెబుతున్నాడు. అతను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాటిని మాత్రమే ఆచరిస్తే నిజ జీవితంలో సుఖాన్ని పొందుతాడు అన్నది వేదం.
"ఆశ కోసి వేసి యనలంభు చల్లార్చి
గోచి బిగియ గట్టి గుట్టు దెలిసి నిలిచినట్టి వాడే నెర యోగి ఎందైన..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి