ఘటనాఘటన సమర్థుడు వేమనామాత్యుడు. వేదము చెప్పిన ప్రతి అక్షరాన్ని ఆయన వ్యాప్తి చేయగలడు. ఆస్తికునిలా వేద విహిత వ్యాఖ్యలను ఆయన సమర్థించగలరు. నాస్తికునిగా వేద రహిత వ్యాఖ్యలను చేయగలడు. ఆస్తిక నాస్తిక శబ్దాలకు అర్థం గందరగోళంగా వుంటుంది. భగవంతుడు ఉన్నాడని వాదించే వాడు. ఆస్తికుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు లేడు వుంటే చూపించండి అన్ని నాస్తికులు వాదించుకుంటారు కానీ నిజానికి వేదములలో వ్రాసి ఉన్న దానిని అంగీకరించిన వారిని ఆస్తికులు అని. వేద విభాగంలో ఇది లేదు అని అభ్యంతరం చెప్పిన వారిని నాస్తికులని చెప్పడం న్యాయమని వేద కోవిదులు వేలూరి శివరామ శాస్త్రి గారు అధ్యయనం చేసి చెప్పిన విషయం. వివేకానందస్వామి ఒక సందర్భంలో చెప్పారు తమ గురువు గారు రామకృష్ణ పరమహంస గారు తన శిష్యులకు కొన్ని అరటిపండ్లు ఇచ్చి ఎవరూ చూడకుండా రహస్యంగా ఎవరికి తెలియకుండా తినండి అని చెప్పాడు. వారు తలా ఒక పండు తీసుకొని ఎవరూ చూడకుండా ఉన్న స్థలాలను ఎంచుకొని గొందులలో, సందులలో తిరిగి తిని వచ్చారు ఒకరు మాత్రం ఆ పనులు తినకుండా తీసుకొచ్చాడు. రామకృష్ణ పరమహంస ఎందుకు ఆ పండును తెనలేడు నేను దానిని తినమని చెప్పాను కదా అంటే మీరు తినమన్న మాట నిజమే కానీ ఎవరూ చూడకుండా ఉండాలి అన్నారు కదా ఆ స్థలం నాకు ఎక్కడా కనిపించలేదు. అందుకే నేను తినకుండా వచ్చాను అని సమాధానం చెబితే పరమహంస చాలా సంతోషించి మిగిలిన శిష్యులకు చేసిన బోధ ఈ ప్రపంచంలో అణువణువు వ్యాపించి ఉన్నది కదా దైవం అది చూడకుండా మనం తినగలమా అని ప్రశ్నిస్తే శిష్యులంతా తెల్లమొహం వేశారు. వేమన చెప్పిన విషయం బుద్ధిమంతుడైనా బుద్ధిలేనివాడైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అబద్ధాలు చెప్పకూడదు. మనసులో ఏది చెప్పాలనుకున్నారో దానిని వ్యక్తం చేయడం ధర్మం. ఈ భూమి మీద శివుని ఆజ్ఞ లేక పోతే చీమ కూడా కుట్టదు, ఏ చెట్టు ఆకయినా వారి ఆజ్ఞ లేకపోతే కదలదు అని శాస్త్రం చెప్తుంది. కనుక ప్రకృతి ధర్మాన్ని ఆచరించాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. భగవద్గీతలో గీతాకారుడు చెప్పిన విషయం కూడా అదే కదా అన్నిటా నేనున్నాను నాలో అన్నీ ఉన్నాయి. దానిని ఆచరించే మనసులు ఉంటే జీవితం ఆనందమయం అవుతుంది లేదా విషాదంలో కొట్టుమిట్టాడ వలసి వస్తుంది అన్నది వేమన సిద్ధాంతం ఆ పద్యం చదవండి.
"అల్పుడైన నేమి అధికుడైన నేమి
చెప్పవలయు రీతి చెప్పినాడా
హరుని ఎరుక లేక యాకులలా డునా..."
"అల్పుడైన నేమి అధికుడైన నేమి
చెప్పవలయు రీతి చెప్పినాడా
హరుని ఎరుక లేక యాకులలా డునా..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి