:అమ్మ;-సి.హేమలత(లతా శ్రీ )పుంగనూరు
తన రుధిర మాంసాలను
 ఇష్టంతో మనకు పంచుతుంది 

మరణం అంచుల వరకు 
వెళ్లి ప్రాణం పోస్తుంది

 అడుగడుగునా అవహేళన ఎదురైనా 
అందమైన నవ్వును ఆభరణంగా ధరించి చరిస్తుంది
బిడ్డ నవ్వును చూసి మురుస్తుంది

సంస్కృతి సంప్రదాయాలను సంబరంగా పాటిస్తుంది 
ప్రేమ నిండిన పలుకులతో ఇంటిల్లిపాదికి స్వాంతన ఇస్తుంది

తన ఇలా అభివృద్ధికై
 అహర్నిశలు శ్రమించు వ్యక్తి 
తన ఆశలు ఆనందాలను
 త్యజించిన ధన్యజీవి అమ్మ

సుకుమారమైన భావాలతో సున్నితమైన 
సహృదయతతో చిరునవ్వు పరిమళాలు 
వెదజల్లి తరించు గొప్ప వ్యక్తి

 నడకలు నేర్పిన,తొలిగురువు.   
మలి వయసున వడిలిన దేహం. సహకరించని 
సత్తువ తో నిస్తేజం సాయంకోసం ఆరాటంతో అమ్మ 

అమ్మ ను పూజించకపోయిన మనిషిగా గుర్తించి 
మసులుకోండి. అమ్మను అంగడి బొమ్మ గా చూసి 
నిన్ను నీవు కోల్పోకు మమతను
మసిచేసి మిడిసి మసకబారకు బిడ్డా


 
కామెంట్‌లు