జడివాన;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వానను
చూడండి
బాల్యానికి
వెళ్ళండి

జడివానను
వీక్షించండి
వానపాటను
స్మరించుకోండి

జడివానలో
తడవండి
ముద్దయి
మురిసిపోండి

జోరువానను
కళ్ళారాచూడండి
హోరుగాలిని
చెవులారావినండి

చిరుకప్పలను
కాంచండి
కప్పలబెకబెకలను
వినండి

చిటపటపడే
చినుకులనువినండి
ఆనందములో
మునిగిపోండి

నీలిగగనాన్ని
కనండి
నీటినిదోసిల్లలో
పట్టుకోండి

ఉరుములకు
చెవులుమూసుకోండి
మెరుపులకు
కళ్ళుమూసుకోండి

మేఘాలను
చూడండి
మదిని
మురిపించండి

హరివిల్లును
చూడండి
ఫొటోలను
తీయండి

అందాలను
చూడండి
ఆనందమును
పొందండి


కామెంట్‌లు