తాడి తన్నేవాడు!అచ్యుతుని రాజ్యశ్రీ

 తాడిని తన్నేవాడుంటే తలదన్నేవాడు  ఉంటాడు అని సామెత!కొంత మంది అంతా తమకేతెలుసు మిగతా వారంతా చవటలు అని ఈసడిస్తారు.ఇతరులని చిన్న చూపు చూస్తారు. అతి తెలివి ప్రదర్శిస్తారు ఇంకొందరు!సైన్స్ టీచర్ పాఠంచెబుతూ ప్రశ్న లడుగుతోంది."క్షీరదాలు అంటే?""పిల్లలని కని పాలిచ్చి పెంచే జంతువులు! మేక ఆవు" "టీచర్!మనిషి కూడా క్షీరదమే కదూ?" హరిమాటలకు అంతా ఫక్కున నవ్వారు.టీచర్ అంది"నిజమే!మనిషి కూడా జంతువే! నేడు మనిషిని చూసి సిగ్గు పడుతున్నాయి జంతువులు! సరే ఎగిరేది పిల్లలని కనిపెంచేది ఏది?" ఈప్రశ్న పిల్లలకు  అంతుబట్టలేదు.కానీ రోహిత్ ఠక్కున జవాబిచ్చాడు "బ్యాట్! అదే గబ్బిలం!పక్షిలా ఎగురుతుంది. పిల్లలని పెడుతుంది. కానీ అది పక్షికాదు అలాఅని జంతువు కూడా కాదుగా? నాసందేహం తీర్చండి టీచర్!:"సరే!గబ్బిలంగూర్చి కథచెప్తాను.ఓసారి  పావురాల లాగా ఎగరాలి అని ఓబట్టని మూతితో పట్టుకుని గబ్బిలాల గుంపు ఆకాశంలో ఎగురుతూ "మేము కూడా  పక్షులమే!ఆకాశంలో ఎంచక్కా  ఎగురుతాం"అని అరిచాయి.పాపం పక్షులు వాటిమాటలకు సై అనక తప్పలేదు. "కానీ  ఎలుకలు అరిచాయి"ఏయ్!మీరు మాలాగా పిల్లలను పెడ్తారు.పక్షి లాగా గుడ్లు పెట్టరుకదా?మీరు మాపార్టీలో చేరాల్సిందే!" "ఉహు..అవి మాలాగా ఎగురుతాయి కాబట్టి మాపార్టీకి చెందుతాయి.మాపక్షిమూకలో చేరాల్సిందే!" ఇలా రెండు ముఠాలుగా చీలి"మాజాతిలో చేరు కాదు మాజాతివారే మీరు" అని జంతువులు పక్షులు  గబ్బిలాలపై దౌర్జన్యం చేయసాగాయి.వాటిబాధ పడలేక గబ్బిలాలు తెలివిగా "బాబోయ్! ఈరెండూ కలిసి మనల్ని నాశనం చేస్తాయి.కాబట్టి ప్రశాంతంగా గుహల్లో చీకటి ప్రాంతాల్లో ఉందామని "నిర్ణయం తీసుకున్నాయి.అందుకే పశుపక్షులు నిద్రపోయేవేళ గబ్బిలాలు సంచరిస్తాయి. "టీచర్ కథవిని పిల్లలకి సగం పాఠం అర్ధంఐంది🌹
కామెంట్‌లు