సుప్రభాత కవిత; బృంద
కలతల చిక్కుముడులన్ని
కనులు విప్పి చెబుతాయి

మనసు మోసే మమతలన్నీ
మరపురాని మాసిపోని
అనుభూతులవుతాయి.


వెండివెన్నెల్లో చుక్కలన్నీ
వేకువ వెలుగులో 
పువ్వులైపోతాయి

కొండలైనా...లోయలైనా
వెలుగులతో నిండితే
పుత్తడిగ మెరుస్తాయి

రేపన్నది మ

రో మంచి
అవకాశం అందరికీ
విజయం  వేపు నడవడానికి

జగత్తుకు చైతన్యమిచ్చి
కాలచక్రగమనానికి
కారణమైన లోకబాంధవుడికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు