శభాష్ శ్రావణి;-వెంకట్ మొలక ప్రతినిధి: వికారాబాద్ జిల్లా
తాండూర్ తెలంగాణ గురుకుల ఓల్డ్ స్టూడెంట్ K. శ్రావణి కి OU CET పీజీ ఎంట్రన్స్ లో ఎంఎస్సీలో  31 ర్యాంకు
అభినందనలు తెలిపిన పాఠశాల ఉపాధ్యాయ బృందం
 
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పెద్ద వారువాల్ గ్రామానికి చెందిన కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి శరణమ్మ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి  కష్టపడి ఆడపిల్లలు అని ఆందోళన చెందకుండా అమ్మాయిల చదువు అవనికి వెలుగంటూ అందరినీ ఉన్నత చదువులు చదివించాలని ఎంతో కష్టపడి ముగ్గురు కూతుర్లని చదివిస్తున్నారు
అందులో మూడవ కూతురే
శ్రావణి . శ్రావణి ఒకటో తరగతి నుండి నాలుగో తరగతి వరకు పెద్దవారు వాల్ గ్రామంలో
ఆలయ విద్యానికేతన్ లో ఇంగ్లీష్ మీడియంలో నాలుగో తరగతి వరకు చదివి గురుకుల ఎంట్రెన్స్ రాసి, సీటు తెచ్చుకొని
వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో
ఆరో తరగతి నుండి
పదవ తరగతి వరకు చదివి
ఎస్ఎస్సిలో 9.5 GPA సాధించి ఇంటర్ సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల గౌలిదొడ్డి లో ఎంపీసీ చదివి 973 మార్కులు సాధించి,
సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల వికారాబాద్ లో చదివి 9.53 స్కోర్ చేసి కళాశాలలో మన్ననలు పొందారు. అనంతరం 2022
ఉస్మానియా పీజీ ఎంట్రన్స్ సెట్ లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ 31 ర్యాంకు సాధించడం తో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఉపాధ్యాయులు రాజేశ్వరి. విజయలక్ష్మి. పాఠశాల వెల్ విషేర్(సాక్షి) వెంకట్. ఉపాధ్యాయులు శ్రీధర్, బాలకృష్ణ సాయి లక్ష్మి, విజయ లక్ష్మి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్. ప్రభు శంకర్. ప్రిన్సిపల్ శ్రీదేవి విద్యార్థిని అభినందిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మానాన్నల ఆశయానికి
అనుగుణంగా చదువుకొని
భవిష్యత్తులో మంచి  ప్రభుత్వ ఉద్యోగం సాధించి పేరెంట్స్ కు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తెస్తానంది. Once again congratulations శ్రావణి💐💐   మొలక తరపున విష్ యు ఆల్ ద బెస్ట్

కామెంట్‌లు