కాంతులీను కనక నగము కన్న
మాయింటి చిన్నారి
చిలిపి చిరు నగవు మిన్న
వెలలేని రత్నరాసుల కన్న
మాయింటి చిన్నారి
తేనెలో ముంచిన మాట మిన్న
ఘనమైన సురలోక పదవి కన్న
మాయింటి చిన్నారి
ప్రేమైక పరిష్వంగము మిన్న
నాకలోకపు నాట్యకత్తెల నాట్యము కన్న
మాయింటి చిన్నారి
బుడిబుడి అడుగుల చిందులు మిన్న
ఘనకీర్తి గాయకుల గానము కన్న
మాయింటి చిన్నారి
అల్లరి లొల్లాయి పాటలే మిన్న
చిన్నారి మాకంటి దీపలక్ష్మి
చిన్నారి మాయింటి శ్రీమహాలక్ష్మి
చిన్నారి ఆయింటి కాబోయె గృహలక్ష్మి !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి