విశ్రాంతి... విక్రాంతి
******
యంత్రానికైనా, మనసు,శరీరాలకైనా తగినంత విశ్రాంతి అవసరం.
యంత్రాన్ని అవిశ్రాంతంగా ఉపయోగిస్తే వేడెక్కి పని చేయనని మొరాయిస్తుంది.
అలాగే మనశ్శరీరాలు కూడా.శరీరానికి విశ్రాంతి లేకుండా అదేపనిగా పని చేస్తూ ఉంటే తీవ్రమైన అలసటకు, అనారోగ్యానికి లోనవుతుంది.
మనసు కూడా అంతే...ఏదైనా విషయం గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది.
విశ్రాంతి ఇవ్వడం అంటే పూర్తిగా పనేమీ లేకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు.
అలసట తీరి ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండటానికి మన కోసం మనం కొద్ది సేపు ఇష్టమైన ఆనందం ఆహ్లాదం కలిగించే పనులు చేస్తూ ఉండాలి.అప్పుడే మన ఆలోచనల్లో, దేహంలో విక్రాంతి పెరుగుతుంది.
విక్రాంతి అంటే వెలుగు, సృజనాత్మకత, క్రియా పరమైన చైతన్య శీలత.
అవసరమైనంత మేరకు విశ్రాంతి తీసుకున్న మనశ్శరీరాలలో విక్రాంతి పెరిగి సామర్థ్యం, సృజనాత్మకత రెండూ ద్విగుణీకృతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి