అక్షరసత్యాలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రాజేంద్రమాటలు
వినవయ్యా
అక్షరసత్యాలు
కనవయ్యా

నవ్వించేవారు
కొంతమంది
ఏడిపించేవారు
మరికొంతమంది

ఇచ్చేవారు
కొంతమంది
దోచేవారు
మరికొంతమంది

నిజాలుచెప్పేవారు
కొంతమంది
అబద్ధలాడేవారు
మరికొంతమంది

ప్రేమించేవారు
కొంతమంది
ద్వేషించేవారు
మరికొంతమంది

వియ్యమాడేవారు
కొంతమంది
కయ్యమాడేవారు
మరికొంతమంది

అన్నితెలిసినవారు
కొంతమంది
ఏమితెలియనివారు
మరికొంతమంది

ముందుకునడిపేవారు
కొంతమంది
క్రిందకుత్రోచేవారు
మరికొంతమంది

మంచివారు
కొంతమంది
చెడ్డవారు
మరికొంతమంది

ఉండిలేనివారు
కొంతమంది
లేకయున్నవారు
మరికొంతమంది

వ్రాసేవారు 
కొంతమంది
చదివేవారు
మరికొంతమంది


కామెంట్‌లు