జీవితాంతం....
ప్రేమ,సేవలతో....
త్యాగమయిగా ఆమె !
. మూడుముళ్ల బంధం !!
******
సు క్షేత్రమై....
నాటిన బీజాలను
బలమైన ఫలాలుగా ...
అందించును భార్య !
*******
మోసి, కని, పెంచి....
వంశాభివృద్దితో ....
మానవ సమాజ
నిర్మాతలు భార్యలే !
******
తల్లియై...
పిల్లలను కని...
కుటుంబాన్ని ఇచ్చేది
అర్ధాంగియైన భార్య !
*****
ధర్మార్ధ కామమోక్షాలకు
అండగా ...
జీవితాలు పండించేది ...
భార్యలే.... !
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి