ప్రపంచ శిఖరాగ్ర అంతర్జాల సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీమతి నెల్లుట్ల సునీత
 

 హెచ్ డబ్ల్యు పి ఎల్ హెవెన్లీ కల్చర్ ,వరల్డ్ పీస్ రిస్టోరేషన్ ఆఫ్ లైట్ దక్షిణ కొరియా సియోల్ సంస్థ ఆదివారం నిర్వహించిన ఎనిమిదవ వార్షికోత్సవం వేడుకలకు ప్రపంచ శిఖరాగ్ర అంతర్జాల సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ కవయిత్రి , సాహితీ బృందావన విహార వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమెన్స్ రైటర్స్ నేషనల్ అసోసియేషన్ చైర్ పర్సన్ మరియు తెలుగు నూతన సాహిత్య ప్రక్రియ సున్నితం సరళ శతకం రూపకర్త,శ్రీమతి నెల్లుట్ల సునీతజూమ్ వేదికగా పాల్గొన్నారు.ఈ సమావేశాన్ని మ్యాన్ హీలి ప్రారంభించారుఇంటర్నేషనల్ ఉమెన్ పీస్ గ్రూప్  సభ్యులుగా  శ్రీమతి నెల్లుట్ల సునీత కొనసాగుతున్నారు.
శ్రీమతి నెల్లుట్ల సునీత శాంతి పట్ల తన అభిప్రాయాన్ని తెలుపుతూఎలాంటి అల్లర్లు ఘర్షణలు లేకుండా సోదర భావంతో దేశాల మధ్యన
స్నేహాన్ని పెంపొందించుకుంటూ ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఆ దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని 
ప్రపంచ శాంతి కోసం శాంతియుత జీవనాన్ని అందరూ అవలంబించుకోవాలని . ఇలాంటి సమావేశాలతో అందర్నీ అవగాహన పరుస్తూ సమాజాన్ని చైతన్యపరిచే విధంగా శాంతితో జీవనము కొనసాగించాలని. యుద్దాల వల్ల కలిగే అనేక నష్టాలను వివరిస్తూ..
 ప్రపంచ దేశాలు శాంతితో అడుగులేయాలని శాంతి సందేశం అందించారు.ఈ ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో మెక్సికో ,ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, కాంబోడియా, ఫిలిఫైన్స్, బంగ్లాదేశ్, నేపాల్ ,మయన్మార్, ఇలా 134 దేశాల నుండి 974  సభ్యులు పాల్గొన్నారు అని తెలిపారు.గత సంవత్సరంలో కూడా ఏడవ వార్షికోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితులుగా  శ్రీమతి నెల్లుట్ల సునీత  సదస్సులో పాల్గొన్నారు ఈ సదస్సులోపాల్గొనడం చాలా ఆనందదాయకం అని ఆమె తెలిపారు నెల్లుట్ల సునీతకు పలువురు సాహితీవేత్తలు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

కామెంట్‌లు