విశ్వమానవాళికి
శ్రీవారి సుప్రభాతం
పరిచయం చేసిన
భారతీయ సంగీత హిమ శిఖరం...!!
ఏ భాషలో పాడినా
అది తన మాతృభాషలో
పాడినట్టుగా ...
భాషా నుడికారంతో
భావయుక్తంగా ఆలపిస్తూ...
ఎన్నటికీ వాడని మల్లెలా
సౌరభాలను వెదజల్లే
సంగీత సుగంధం...!!
స్వరాభిషేకంతో
ఐక్యరాజ్యసమితిలో
సందేశాన్ని వినిపించి...
గాయనిగా చరిత్ర సృష్టించిన
సంగీత సామ్రాజ్ఞి...!!
స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లుగా...
శృతి,లయ ,ఆలాపనతోపాటు
భావాన్ని ,భక్తిని
సమపాళ్లలో వ్యక్తీకరించి
పామరులకు సైతం
శాస్త్రీయ సంగీతంలో
మెప్పించిన సంగీత కళాకారిణి...!!
జీవితకాలమంతా
భారతీయ సంప్రదాయాన్ని , సంస్కారాన్ని
అమితంగా ప్రేమించి
భారత రత్నగా...
ఆమె ఎక్కని స్టేజి లేదు...!!
సాధన ద్వారా సాధించుకున్న
గొప్ప వరంతో...
సంగీత కళానిధిగా
ఆమె పాడని కృతి లేదు...!!
మహాత్మాగాంధీ ప్రశంసించిన మహనీయురాలిగా...
ఆమె స్వరానికి
నీరాజనాలు పట్టిన
పురస్కారాలు ఎన్నో...!!
ఆబాల గోపాలాన్ని
మెప్పించిన
ఆ మధుర స్వరం
మూగబోయినా....
ప్రతి ఇంట సుప్రభాత సేవలో
"సంగీత జల్లులు"
కురిపిస్తూనే ఉంటుంది
సూర్య చంద్రులు ఉన్నంత కాలం...!!
( "ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి" గారి జయంతి సందర్భంగా...)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి