బలి! అచ్యుతుని రాజ్యశ్రీ

 గొర్రెలు మేకలని తోలుకుంటూ ఆపిల్లాడు  వెళ్తుంటే  వెనకాల బుద్ధుడు  శిష్యులు ఉన్నారు. ఓకుంటి మేకపిల్ల సరిగ్గా నడవలేకపోతుంటే ఆపిల్లాడు దాన్ని కొడుతున్నాడు.అది హృదయవిదారకంగా మే..మే..అని అరుస్తోంది. "దాన్ని కొట్టకుబాబూ" బుద్ధుడు వారించాడు. "ఆ..ఇంకాసేపట్లో దాన్ని  ఎలాగో చంపుతారు.మహారాజు అజాతశత్రువు చేసేయాగానికి ఇవి బలిపశువులు!" అన్నాడు కుర్రాడు. అంతే బుద్ధుడిగుండె బద్దలైంది.తను కూడా  ఆమందవెంట యాగశాలకు వెళ్లాడు.అక్కడ ఎన్నో పశువులున్నాయి.
బుద్ధుడు రాజు ని సమీపించి"రాజా!ఇన్ని అమాయక మూగప్రాణుల్ని బలిఇచ్చే బదులు  వాటికి ప్రాణదానం చేయటం ఎక్కువ విలువైనది కదా!"అని  ఎంత నచ్చజెప్పినా రాజుససేమిరా అని మొండికేశాడు."సరే ఈగడ్డిపరకను నేను తుంపులుచేస్తున్నాను.వాటిని తిరిగి అతికించి గడ్డిపోచ గా మార్చండి"."అది అసాధ్యం!" అహంకారం తో అరిచాడు రాజు!"ఓ గడ్డిముక్కలను అతికించలేని నీవు ఇన్ని ప్రాణులని చంపి ఏంసాధించగలవు?కేవలం దేవుడే సృజనచేసి  నాశనం చేయగలడు.మనం మానవమాత్రులం! ఈమూగజీవాలకన్నా మనం బలవంతులం కాబట్టి  చంపగలం! అదే ఏక్రూరమృగమో అల్లంత దూరంలో కనపడితే ప్రాణభయంతో పరుగులు తీస్తాం.యజ్ఞదేవతను సంతోషపెట్టాలనుకుంటే నన్ను బలిఇవ్వు.నరుడు ఉన్నత ఉత్తమ ప్రాణికదా?మంచి దే ఎవరికైనా ఇవ్వాలి. "అంటూ బుద్ధుడు బలివేదికపై నిలబడ్డాడు.రాజు కి జ్ఞానోదయం కల్గింది. బుద్ధుడి శిష్యుడిగా మారాడు.నేడు గోమాతను చంపి విందులు చేసుకునేవారు పెరిగారు.మహాపాపం మూటగట్టుకోటమే మరి🌹
కామెంట్‌లు