సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 సఖ్యత... సమైక్యత
  *****
 సఖ్యత... సమైక్యత దాదాపుగా ఒకే అర్థాన్ని కలిగి వున్నా వాటిల్లో కొంత అర్ధ భేదాన్ని కలిగి ఉన్నాయి.
 సఖ్యత అంటే స్నేహం. అపోహలు, అపార్థాలు,అహాలు లేకుండా స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ స్నేహ భావంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసిమెలిసి ఉండటమే సఖ్యత.
ఉన్నా లేకపోయినా సర్దుకు పోతూ, తృప్తిగా జీవిస్తూ,పచ్చగా కళకళలాడే కుటుంబమే సఖ్యతకు చక్కని ఉదాహరణ.
సమైక్యత అనేది సామూహిక జీవనానికి సంబంధించిన పదం. కుల మతాలకు అతీతంగా వ్యక్తులు లేదా సమూహాలు, ప్రాంతాలు పరస్పరం గౌరవాభిమానాలతో, ఐకమత్యంగా కలిసి మెలిసి ఉండటాన్ని సమైక్యత అంటారు.
ఒక దేశానికి చెందిన జాతి పౌరులంతా లౌకిక తత్వంతో పై విధంగా కలిసి మెలిసి ఉండటాన్ని జాతీయ సమైక్యత అంటారు.
 సఖ్యత ,సమైక్యత జీవితంలో పాటించాల్సిన విలువైన పౌర సూత్రాలు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు