కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో గురజాడ అప్పారావు జయంతి

 స్థానిక కర్నూలు కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లోని లైబ్రరీ ప్రాంగణంలో ఘనంగా జయంతి మహోత్సవాలు జరిగాయి.
కార్యక్రమంలో కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ  గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవియన్ని. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది.అతను చేసిన రచనలు 19వ శతాబ్దం నుండి ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు.వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం,మధురవాణి,రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి.అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన గురజాడ అప్పారావు గారు,తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడన్ని, గురజాడ అప్పారావు గారికి కవి శేఖర అనే బిరుదు కూడా ఉందన్ని తెలియజేశారు
కామెంట్‌లు