బంగారు బతుకమ్మ; - సృజన సింధూర
వివిధ వర్ణాల సీతాకోక చిలుకలు
పట్టు చీరలు గట్టిన సీతాకోక లు
సీతాకోక ల చేతుల్లో బతుకమ్మ లు
పచ్చా పచ్చని రంగుల బతుకమ్మ లు

పూల లాంటి అమ్మాయిల చేతుల్లో 
సుత్తి మెత్తగా పేర్చబడిన బతుకమ్మ లు
సున్నితమైన లేత పువ్వుల దేహాలు
కంది పోకుండా బతుకమ్మలు ఊరేగుతూ

అందరికీ బతుకు నిచ్చే బతుకమ్మలు
జనుల బాగు కోరే బంగారు బతుకమ్మ లు
ఆయుష్షు నిచ్చి ఆరోగ్యం కోరే బతుకమ్మ లు
కోరిన వన్నీ ఇచ్చినీళ్ళలో నిమజ్జనం అగును.

కామెంట్‌లు