సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ప్రయత్నించు... పాటించు
******
ప్రయత్నించు,పాటించు...ఇవి రెండూ మనిషిని అత్యున్నత స్థాయికి ఎదిగేలా, అందరిలో వినమ్రంగా ఒదిగేలా చేసే మూల సూత్రాలు.
అనుకున్నది సాధించేందుకు చేసే చర్యనే ప్రయత్నం అంటారు.
ఈ ప్రయత్నానికి కృషి,పట్టుదల, అంకిత భావం, అకుంఠిత దీక్ష తోడైతే ప్రయత్నం  తప్పకుండా గెలుపు సంతకం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
 చేసే ప్రయత్నంలో  పాటించాల్సిన విలువైన అంశాలు కొన్ని ఉన్నాయి.
అవే హితమైన మాటలు,నైతిక విలువలు, మనస్ఫూర్తిగా మన ఉన్నతిని కాంక్షించే పెద్దల సలహాలు.
అవే ప్రయత్నానికి దారి దీపాలవుతాయి.గెలుపు కేతనం ఎగరేసేందుకు పట్టుకునే జెండా కర్రలవుతాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు