సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అవసరం... అవకాశం
    ******
అవసరం, అవకాశం.. ఇవి రెండూ మనిషికి పరీక్ష పెట్టే తూనిక రాళ్ళు.  ఈ సందర్భాలు చాలా వరకు వ్యక్తి లోని సహజాతాలను బయట పెడతాయి.
అవసరాన్ని బట్టి మారిపోయే వ్యక్తులు కొందరు ఉంటారు. వాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుని అవసరాన్ని గట్టెక్కించుకుంటారు.
ఎంత అవసరం వచ్చినా ఆత్మాభిమానాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వ్యక్తులు  కొందరు ఉంటారు. అభిమానమే ధనంగా భావిస్తారు. ఎలాంటి ఇబ్బందుల వచ్చినా  మనో ధైర్యంతో ఎదుర్కొంటారు.
అవకాశం వ్యక్తి యొక్క ప్రవృత్తి, వ్యవహరించే తీరును బయట పెడుతుంది.
 కొందరు స్వార్థ పరుల విషయంలో అవకాశం బురదలో పడిన వాన చినుకు అవుతుంది.
వారిలోని మలిన హృదయాన్ని బహిర్గతం చేస్తుంది.
అదే అవకాశం మానధనుల విషయంలో ముత్యపు చిప్పలో పడిన చినుకు అవుతుంది. వారిలోని మానవీయ హృదయాన్ని చాటుతుంది.
అందుకే అంటుంటారు అవసరం,అవకాశం అనేవి మనస్తత్వాన్ని పరీక్షించే గీటురాళ్ళని.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు