పోలవరపు లక్ష్మీ నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనం

 పద్యసారస్వత పరిషత్ నెల్లూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు బాలాజీనగర్ నందలి శ్రీ సీతారామస్వామి మందిరములో  రుక్మిణీ కల్యాణం అను అంశముపై  విశ్రాoత సీనియర్ ఉపన్యాసకులు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.
పరమాత్మయైన శ్రీకృష్ణుని చేరుటకై  జీవాత్మ యైన రుక్మిణి  మదిలోని ఆర్తి,ఆవేదన,భక్తి ని  శ్రీ  లక్ష్మీ నరసింహారావు  చక్కగా  విశ్లేచించారు..రుక్మిణీ కల్యాణ ఘట్టమందలి ప్రేమ,భక్తి,యోగము నకు సంబంధించిన విశేషములతో సభను రంజింప జేసిరి. 
పైకార్యక్రమానికి సంస్థ కోశాధికారి విద్వాన్ శ్రీ సూరం చంద్రశేఖరం గారు ఆధ్యక్షత వహించగా సంస్థ ప్రధానకార్యదర్శి డా.చీమకుర్తి వేంకటేశ్వరరావు గారు పర్యవేక్షణ చేశారు. శ్రీ చక్కిరాల జయప్రసాదు గారు సభాపోషకులుగా వ్యవహరించిరి. డా.శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాదరావుగారు,ఊరుబిండి వేంకట సుబ్రమణ్యశాస్త్రిగారు,శ్రీఅగస్త్యరాజు సుబ్బారావుగారు,శ్రీ తంగిరాల నరసింహకుమార్,గుండాల నరేంద్ర బాబు ,విశ్రాంత ఇంజనీరు శ్రీ  గాలి సుధాకరరావుగారు
,ఆలయ పాలక వర్గ అధ్యక్షులు శ్రీ అమర్తలూరు వెంకటేశ్వర గుప్తగారు మరియు ప్రముఖు పండితులు హాజరై సభను విజయవంతంచేసిరి.
కామెంట్‌లు