కూర్మి... పేర్మి...
*****
కూర్మి లేని జీవితం,పేర్మి లేని బతుకును ఊహించలేం.
ఇవి రెండూ ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తాయి.
కూర్మి అంటే చెలిమి, స్నేహం, నెయ్యం సహవాసం... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. కూర్మి అనేది రక్త సంబంధాన్ని మించిన గొప్ప బంధం.
ఆస్తి, అంతస్తు, కులం,మతం, జాతి, మతం వీటన్నింటికీ అతీతమైనది.
నిస్వార్థం,నిజాయితీ, నిష్కాపట్యం, భరోసా, బాధ్యత, త్యాగం లాంటి ఎన్నో మానవీయ విలువలతో కూడిన అత్యుత్తమ పదం కూర్మి.
పేర్మిని అత్యంత బలమైన అభిమానానికి చిహ్నంగా భావిస్తారు.
ప్రేమ, అనురక్తి, అనురాగం ఆప్యాయత, మమకారం, మక్కువ, వాత్సల్యానికి మొదలైన పదాలకు అర్థంగా ఉపయోగిస్తారు.
సమాజంలో పేర్మి కోసం తపించే వాళ్ళూ, సరైన కూర్మి దొరక్క చెడు దారిలో నడిచే వాళ్ళూ చాలా మంది ఉన్నారు.
మనం ఎంతో ఇష్టంగా చదివే ఇతిహాసాలు పురాణాలు, పంచతంత్ర కథల్లో కూర్మి సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి.
కుటుంబంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పుష్కలంగా పేర్మి ,మంచి కూర్మి దొరికిన వారు సమాజంలో ఉన్నత విలువలతో కూడిన జీవితం గడుపుతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి