సుప్రభాత కవిత ; --బృంద
నింగిని తాకే చూపుకి
దొరికిన అందం

నింగిని నేలతో కలిపే
బంధం

చేతికి అందే  వెలుగుల
బంతి చందం

బండరాళ్ళకు పుత్తడి
పూతల  ముస్తాబు

నిశ్చలమైన నీటి వీణపై
బంగారు తీగల  మెరుపు

పలుకుతున్న ఉదయరాగం
పవనవీచికలపై పయనం

కొమ్మలు చేసే నాట్యం
శిలలు చూసే చోద్యం

ముసిరిన వెలుగుల దాడికి
మురిసిన  ముచ్చటైన ఉదయం

కోరికల దుస్తులేసుకుని
మనసు మొదలెట్టే పయనం

పొంగిన హృదయం 
వెలుగులు నిండిన ఉదయం

చూడచక్కని ఉదయానికి
చెబుతున్న 

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు