మనకీర్తి శిఖరాలు .;-కె.ఎన్.కేసరి . ;- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 కె.ఎన్.కేసరి . (1875 - 1953) గా పేరు పొందిన ఈయన అసలు పేరు కోట నరసింహం. కేసరి కుటీరం అనే ఔషధశాల స్థాపకుడు. మదరాసులోని మైలాపూరులో కేసరి పాఠశాలను స్థాపించాడు. కేసరి దానశీలిగా పేరు గాంచారు. స్త్రీ జనోద్దరణకై గృహలక్ష్మి మాసపత్రికను స్థాపించాడు. కర్నాటక సంగీత విద్వాంసుడు, సినీ గాయకుడైన ఉన్ని కృష్ణన్ ఆయన మునిమనుమడు. 
కేసరి, 1875 ఏప్రిల్ 26 న ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలానికి చెందిన ఇనమనమెళ్ళూరు గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. వీరిది పేద కుటుంబం. కేసరికి ఐదేళ్ల వయసులో తండ్రి మరణించాడు. తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండటం వల్ల బడికి సరిగా వెళ్ళగలిగేవాడు కాదు. తల్లి దర్జీ పని చేస్తుండేది. తల్లి కష్టపడి తనను పెంచి పెద్ద చేస్తుండటం గమనించిన ఈయన, తన పదకొండేళ్ళ వయసులో కాలినడకనే మద్రాసు చేరుకుని అక్కడే చదువుకోవడం మొదలు పెట్టాడు. హిందూ ధార్మిక పాఠశాలలో స్కాలర్‌షిప్పు పొందాడు. కొంతకాలానికి 1889లో తల్లి కూడా మద్రాసుకు వచ్చి అతనితో ఉండసాగింది. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె జబ్బుచేసి మరణించింది. ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను "నా చిన్ననాటి ముచ్చట్లు" అనే పుస్తకంగా ప్రచురించాడు .
చదువు పూర్తి చేసుకుని పలుచోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేమీ సత్ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత ఆయన వైద్యం నేర్చుకోవడం ప్రారంభించాడు. కోమట్ల సహాయంతో శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆయుర్వేద వైద్య కళాశాలలో కొలువు సంపాదించాడు. 1900 సంవత్సరంలో మద్రాసు జార్జిటౌన్ నారాయణ మొదలి వీధిలో ఒక చిన్న బాడుగ ఇంటిలో కేసరి కుటీరము పేరుతో మందుల తయారీ సంస్థను ప్రారంభించాడు.
1928లో కేసరి, సామాజిక రాజకీయ రంగాలలో మహిళను ప్రోత్సహించేందుకై గృహలక్ష్మి అనే తెలుగు వారపత్రికను స్థాపించి, దానికి వ్యవస్థాపక సంపాదకుడిగా. మహిళా రచయితలను పెంపొందించాడు. మహిళా రచయితలను సత్కరించేందుకు గృహలక్షి స్వర్ణకంకణమనే పురస్కారాన్ని స్థాపించాడు.
1943లో కేసరి మద్రాసులోని మైలాపూరు తెలుగు ప్రాథమిక పాఠశాల యొక్క యాజమాన్యపు బాధ్యతలను తీసుకొని దానికి తగిన నిధులు సమకూర్చి, ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకెళ్ళాడు 1951లో తన విద్యాభివృద్ధి పనులను మరింత విస్తరించడానికి కేసరి విద్యాసంస్థ అనే ధర్మాదాయసంస్థను ఏర్పాటుచేసాడు. ఆ సంస్థ తన ఆధ్వర్యంలో ఇప్పడు అనేక పాఠశాలలను నడిపిస్తున్నది.
కేసరి కుటీరం ఉత్పాదనలు.
అమృత, రక్తశుద్ధిద్రావకము
అర్క, సర్వజ్వరనివారిణి
కేసరి డెంటల్ క్రీం, దంతధావన నవనీతము
కేసరి పుష్పత్రయము
లోధ్ర

కామెంట్‌లు