చింత తీర్చే కాంతి పుంజము
కంటికెదురుగ వచ్చి నిలిచెను
కోటి సూర్య ప్రభల తేజము
ఒక్కసారి చుట్టుముట్టెను
జగములేలే త్రిపురసుందరి
నగవులీనే వెన్నెల చూపు
అవని అంతయు పరచుకుని
పావనమ్మె చేసే భువిని
రోజుకొక్క రూపమ్మున
కొలుచు భక్తుల మనమ్ముల
కొలువుదీరి పూజలందుకుని
కోటి వరముల కొంగున కట్టును
ముగ్గురమ్ముల మూలపుటమ్మ
సదా మా మనమ్ముల నిలిచియుండి
కాచి రక్షించు జగన్మాతవై
సన్మార్గమున నడిపింపవమ్మా!
నా రాష్ట్రాన్ని నా దేశాన్ని
జగమునందు మిన్నగా వెలిగించవమ్మా
అలముకున్న తిమిరాల
దునుమాడి పారదోలి
పసిడి వెలుగుల నింపవే
పలుకుతేనెల తల్లీ పరమేశ్వరీ
దేవీ నవరాత్రుల శుభాకాంక్షలతో
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి