యే పూజా ఫలమో ;-Dr కందేపి రాణీ ప్రసాద్
పచ్చి నెత్తురు తాగే మృగం లా పుట్టలేదు
కాళ్ళ కింద నలిగే పురుగుల్లా పుట్టలేదు
చేతి చరుపు తో చచ్చే దోమల్లా పుట్టలేదు 
ఏ పూజా ఫలమో మానవుల మైనాము.

నీళ్లలో నాని జారే నాచులా పుట్టలేదు
ఎడారి లో నీళ్ళు లేక మాడేలా పుట్టలేదు
అడవి లో కాచే వెన్నెల లా పుట్టలేదు
ఏ పూజా ఫలమో మానవుల మైనాము.

కదల లేని చెట్టు మాను లా పుట్టలేదు
కంటికి కనబడని సూక్ష్మ క్రిమి గా పుట్టలేదు
కాలితో తన్నే బండ రాయి గా పుట్టలేదు
ఏ పూజా ఫలమో మానవుల మైనాము.

రాయి పై పడే వాన చుక్క లా పుట్టలేదు
పండ్లు కాయని ముళ్ళ చెట్టు లా పుట్టలేదు
గోరు తో  చిటుక్కున చంపే పేను లా పుట్టలేదు
ఏ పూజా ఫలమో మానవుల మైనాము.
నవ్వలేని, ఏ డవలేని జంతువు లా పుట్టలేదు 
మట్టి అడుగున జీవించే ప్రాణ గా పుట్ట లేదు
ఎగిరి ఎగిరి రెక్కలు ముక్కలయే పిట్ట గా పుట్ట లేదు
ఏ పూజా ఫలమో మానవుల మైనామ్.


కామెంట్‌లు