సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు; -బిచ్చాల సౌందర్య--చరవాణి: 8106861914
 251.
బృందావన జాతీయ వేదిక
నవకవులకు ఆస్థాన పీఠిక
తెలుగుభాషా సాహిత్యానికి ప్రతీక 
చూడ చక్కని తెలుగు సున్నితంబు
252.
నూతన ప్రక్రియ సున్నితంబు
రూపకర్త సునీతమ్మ ఆవిష్కరణంబు
చూడచక్కని తెలుగు పద్యమకుటంబు
చూడ చక్కని తెలుగు సున్నితంబు 
253.
వారానికో నూతన అంశం
వర్తమాన సామాజికమే కవితాస్త్రం 
ఐదు పద్యాలలో నిబడీకృతం
చూడ చక్కని తెలుగు సున్నితంబు
254.
విశ్లేషణాత్మక సమీక్ష పరిశీలకులు
సున్నితమైన సూచనలు సలహాలు 
రాసేకవులకు ప్రోత్సాహక అక్షతలు
చూడ చక్కని తెలుగు సున్నితంబు
255.
వెన్నుతట్టి మేలుకొలిపే నాలోని కవిని 
ప్రదీపసౌందర్యమై వెలువడే పుస్తకం 
సారస్వత సంపదయే ఆమెదృక్పథం 
చూడ చక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు