కవిత్వం ; ఎం . వి. సత్యప్రసాద్ , --.9398155633.
భావముల బావుకథ 
భావాలకు నేర్పింది కవిత

చిపిలి చూపులోని  మెరుపు
చూపింది తొలి చూపులోనే వలపు

కవిని కాదు అంటావు
కవితలు పంచుతావు

తియ్యని మాటలలోని ఆ నిర్మలత్వం
తెస్తుంది ప్రతి ఒక్కరిలో కవిత్వం

అందంగా నువు గీసే ఆ బొమ్మలు
లేపాయి పైకి నా కనురెప్పలు

తియ్యని నీ కంటస్వరం పలికింది సుస్వరం
మధురమైన నీ గళంతో కలిపి పాడాలి యుగళము

జీవితం లోని ఇన్ని కళల సమ్మేళనం, 
నిలిపింది మనసంతా ఆనందాల పరిమళం


కామెంట్‌లు