బాల పంచపది=============1. ఏకాగ్రతకు మూలము !అన్యచింతన దూరము!ఆధ్యాత్మిక జీవన మార్గము!మోక్ష సాధన రహస్యము!ధ్యానం చేయాలి,మోక్షం సాధించాలి, రామా!2. మనసు మనిషికే ఉన్నది!అదే మనల్ని నడిపిస్తున్నది!ఆది, నీవు నా వశం అంటుంది!మన,వశమైతేమాటవింటుంది!ధ్యానం చేయాలి ,మోక్షం సాధించాలి ,రామా!3. మనసును అదుపులో,ఉంచాలి !సరియైన దారి,నడిపించాలి !దైవం మీద ,దృష్టి నిలపాలి !నిత్యం ధ్యానం,సాధన చేయాలి!ధ్యానం చేయాలి ,మోక్షం సాధించాలి ,రామా!4. నేడు జీవితం,సమస్యల మయము!అనుక్షణం ,ఘర్షణ కారణము!మనసు ,అశాంతికి ఆశ్రయము!ధ్యానం ,జీవన రక్షణ కవచము!ధ్యానం చేయాలి ,మోక్షం సాధించాలి, రామా!5. తనువు ఆసనం వేయాలి!నాలిక నామం జపించాలి!మనసు జపం చేయాలి!అంతరంగం నిర్మలం కావాలి!ధ్యానం చేయాలి ,మోక్షం సాధించాలి ,రామా!________
యోగం;-.డా.పి.వి.ఎల్. సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి