ఓ రోజు రమ్య ఓ కార్యక్రమం కోసమై బస్సు ప్రయాణం చేస్తూ ఉంది.ఒంటరిగా దూర ప్రయాణం కష్టo కదా ఓ తోడు ఉంటే బాగుండు అని తెలిసిన మనిషి గిరీష్ అటువైపుగా పోతుంటేను
కలిసి పోదాం అనుకున్నది.పరాయి మగాడు పాములాంటివాడనే అనుభవము లేని రమ్య మాటమాట కలిపింది .పక్కనే కూర్చున్న పాలరాతి బొమ్మ నిగనిగలాడే పరువాలు చూసి మతితప్పింది . సూటిగా కన్ను గురిపెట్టాడు అమాంతంగా మూగ భాషలు ముద్దుగా రమ్య మోముపై రుద్దాడు.తియ్యని ముద్రను బుగ్గపై వేసాడు.వామ్మో ఇదేమిటని అవాక్కవ్వడము ఆమె వంతు అయింది ఆశ్చర్యంలో మునిగిపోయింది రమ్య.అంతలో రూములో పెట్టి ఘడియ పెట్టి ఇదేమిటని గట్టిగా ఖండించింది రమ్య.మగాడు కదా పరిస్థితిని బట్టి కవ్వించడము తెలుసును క్లిష్టమైన సందర్భాన్ని అనుకూలంగా మలుచుకోవడము తెలుసు కానీ రమ్యకు అనుకోని సంఘటన ఎదురైనది మనసులో తనకు ఉన్న ఆలోచనలకు సరిపోనీ అంద చందాలు అతనివి అయినా దూరముగా ఉండమని ప్రాధేయ పడింది రమ్య.కానీ తియ్యని మాటలతో మత్తుగా మత్తు కలిగించే నైజముతో ఆమె అందాలను ఆస్వాదించే వరకు పట్టుపట్టని విక్రమార్కుకుడులా పదే పదే ఫోన్లు చేస్తూ పిల్లా పిల్లా అంటూ చక్కర్లు కొడుతుంటే ఇదంతా నిజమని నమ్మిoది రమ్య. నల్లని రoగుతో పనియేమిటీ తెల్లని చల్లని మనసు ఉంటే చాలుఅని అందరికన్నా ఎక్కువగా ప్రేమను పంచుతాడు అనుకుంది .గిరీష్ అంతులేని అనురాగమును చూపినాను ప్రతిదీ లోలోపల వివక్ష రంగు పురుడు పోసుకుoటూనే ఉంది డబ్బులు అంటే పిసినారి తనoమరి నమ్మిన దానిపై కనికరం చూపని కఠిన హృదయo బతుకు బాటలో అన్నీ చేయగల సమర్థత అంతులేని గుండెనిబ్బరం అతని సొంతము మరి ఓ నిమిషం రమ్య కనిపించకపోయినా మాట వినిపించకపోయినా హైరానా పడిపోయేవాడు ఎప్పుడు ఏమి చేస్తుందో ఎలా వుందోఅన్నట్టుగా ఆతృతతో తహతహలాడిపోయేవాడు .నిజమే ఆరిపోయే ప్రేమకి వెలుగు ఎక్కువ మరి అలా సాగేదారిలో ఆస్థులు అంతస్థులు పోలికల దారిలో రగిలిపోయాడు నా కన్న గొప్పచదువులు చదివినవారు లేరనుచు పొగరుగా మాటాడుతూ రమ్య ప్రేమను చులకనగా తీసుకునేవాడు .ఇంతకు మునుపే మగాడి కపటనటనను చవిచూసిన రమ్యకు అసలు నమ్మేది కాదు. మగాల్లు అందరూ మోసగాళ్లు అనే భావన గట్టిగా ఉండేది.చదువుకునే రోజుల్లో ఓ సంబంధమును కొనసాగిస్తూనే మరలా ఇలా రమ్యను ముగ్గులోకి దింపాడు అలా కొన్నిరోజుల సరదా తీరాక పట్టించుకోవడము మానేశాడు గిరీష్ ఊసరవెల్లి రంగులు మార్చుకున్నటు రకరకాలుగా మారిపోయే మనస్తత్వం గిరీష్ ది. ఇలా సాగుతూ ఉండగా ఇంకో వగలాడిని జిత్తులు మారి చేష్టలతో ప్రేమలో నిండుగా మునిగిపోయాడు. ఇది ముందుగానే పసిగట్టుంది రమ్య ముఖము మీద నిలదీయగా అవును అంటూ సమాధానం ఇవ్వగా రమ్య గుండె చెరువుగా మారింది మనసు ముక్కలై పోయింది.కన్నీటి బిందువులు ఏరులై బుగ్గలపై నుండి జారాయి .మూడు సంవత్సరాలు రమ్యను చెత్తలా పక్కకు విసిరేశాడు ఎదో మయాలోగిలిలో భ్రమలో నిలిచాడు .పైగా అందినంత డబ్బు లాక్కుని కర్కశ ప్రవర్తనతో రమ్య మనసు విసిగిపోయినది .కొంతకాలం తరువాత గిరీష్ కి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి రమ్య దూరమై అదృష్టం మాయమైపోయింది అనుకొనుచు బతుకు అంతా ఎండమావిలా మారి అలా అనారోగ్యంకు చెరువైపోయాడు గిరీష్.రమ్య తియ్యని ప్రేమ విలువ తెలుసుకోని నిస్వార్థమైన ప్రేమకు దూరమైపొయానని కుమిలిపోయి వాపోయాడు. చేసిన ద్రోహానికి దేవుడు నాకు వ్యాపారములో లక్షల్లో నష్టం వచ్చింది అనారోగ్యంతో చావుకు దగ్గర అయ్యానని చెప్పాడు. గిరీష్ గుర్తుకువచ్చిన ప్రతిసారి అoతులేని భావవ్యక్తీకరణలో మనసు ఊగిసలాడేది. ఎదో తియ్యని అలజడి గుండెను పిండేసేది . ఆడదంటే మరి అమృతహృదయానికి పుట్టినిల్లు కదా. గిరీష్ ని తలుచుకున్న ప్రతిసారి కను రెప్పచాటున దాగిన ప్రేమ కన్నీరులా వర్షించేది.మనసు బాధలో తడిసి మూగపోయేది. కుటుంబములో భర్త విలువ తెలుసుకోని పరాయి మనిషి నటనలో మనసు సుమాధి ఐపోతుందని భర్తలో నిజమైన అనురాగము ఉంటుందని రమ్య తెలుసుకుంది.పవిత్రతమైన ప్రేమ బంధముకు గిరీష్ వెన్నుపోటు పొడిచాడని రమ్య కృంగిపోయింది . ఒంటరిగా బతుకు సాగిస్తూ స్వేచ్ఛగా బతుకును విజయపథములో సాగించాలి గాని.కలికాలపు కపట ప్రేమలో చిక్కి మనసును సమాధి చేసుకోకూడదని రమ్య గుణపాఠం నేర్చు కున్నది.తప్పు చేసి మరలా తప్పులు చేస్తూ ఉంటే బతుకుకు అర్థం లేదని బంధము లేనిచోట ప్రేమ ఉండదని పచ్చని బతుకును చూసి నిప్పులు పోసుకునే పరాయివాడి ప్రేమ నైజము అని ప్రతి ఇక్కరూ గ్రహించాల్సిన సత్యము తెలుసుకోవాలిసిన జీవిత నిజము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి