జీవితోదయం నాటకం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చేసిన మొదటి నాటకం అన్నపూర్ణలో శ్రీకృష్ణ దేవరాయ పాత్ర  బందా గారి నిర్వహణ  నాకు మంచి పేరు తెచ్చి పెట్టిన నాటకం.
శ్రీనివాసన్ తమిళదేశానికి చెందినా తెలుగు అమ్మాయి సుభద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పని చేశారు. ఆ రోజుల్లో వీరు రేడియోకు  చేసిన సేవ అపూర్వం, అభినందనీయం. 
శ్రీనివాసన్ గారు మద్రాస్ వెళ్లి నప్పుడు అక్కడ తమిళంలో చోరామస్వామి వ్రాసిన  నాటకం నచ్చి ఆ తమిళ నాటకం ప్రతిని తీసుకువచ్చారు. అందులో నాది వైవిద్యభరితమైన పాత్ర  వితంతు వివాహం నన్ను ప్రోత్సహిస్తూ రాసిన నాటకం.  చోరామస్వామి  సామాజిక స్పృహతో చాలా సహజంగా నాటకాలు రాయడంలో మేటి  వ్రాయడమే కాకుండా దానిలో ప్రధాన పాత్ర కూడా తానే వేస్తూ ఉంటాడు. అతను వేసిన పాత్రను  నేను వేయడం కాకతాళీయం. నాకూ శ్రీరంగం గోపాలరత్నం గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన నాటకం అది.
తమిళంలో నుంచి తెచ్చిన  నాటకాన్ని తెలుగులో ప్రసారం చేస్తే బాగుంటుందని దాని హక్కులు తీసుకుని  వేదంలోనూ, సంగీతంలోనూ కూడా వైష్ణవ నిష్ణాతులైన నల్లాన్ చక్రవర్తులు కృష్ణమాచార్యులు గారి ద్వారా  అనువదించి  దానిని నండూరి సుబ్బారావు గారిని నిర్వహించమన్నారు. ప్రధాన స్త్రీ పాత్ర శ్రీరంగం గోపాలరత్నాన్ని ఎన్నుకొని కథానాయికుడి కోసం  వెతుకుతుండగా మా ఆనంద్ తో వేయిద్దామని నండూరి సుబ్బారావు గారు అంటే  శ్రీనివాసన్ గారు నా వద్దకు వచ్చి నాన్నా చాలా మంచి వేషం నీ జీవితానికి దగ్గరగా ఉన్న వేషం అది నీవు చేస్తేనే బావుంటుంది అని చెప్పాడు.  సరేనని  మూడు రోజులు కష్టపడి చేశాం. మాతో పాటు బందా కనక లింగేశ్వర రావు గారు వేమవరపు శ్రీధర్ కూడా నటించాడు. విజయవాడ కేంద్రంతో పాటు, హైదరాబాద్  మద్రాస్ కేంద్రాలు కూడా రిలే  చేశాయి. అది విన్న ముదిగొండ లింగమూర్తి గారు (ప్రఖ్యాత సినీనటులు, నాగయ్య గారు) ఉత్తరాల ద్వారా అభినందించారు  తర్వాత విజయవాడ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి  నన్ను నా శ్రీమతిని  మా బాబు గ్రే గ్రే ని  ఆశీర్వదించి  ప్రత్యేకంగా జీవితోదయం నాటకాన్ని గురించి ప్రస్తావించి అభినందించారు. దాన్ని  జీవితంలో ఆనందించవలసిన విషయంగా భావించాను.

కామెంట్‌లు