చేయి....చేయే...;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా ఆత్మస్థైర్యం, ఆత్మధైర్యం రెండు ఉంటాయి. ఎలా ఉన్నవాడైనా  తనను తాను పూర్తిగా తెలుసుకొని ఎదుటి వారిని కూడా గౌరవించేవారు  ఉత్తమ జీవితాన్ని గడుపుతారు  నేనే గొప్పవాణ్ణి నన్ను మించిన వారు ఎవరూ లేరు అని అహంకారంతో భీష్మించుకు కూర్చున్న వారు తప్పకుండా  కష్టాలపాలు అవుతారు  వేషాన్ని చూసి భాషను చూసి ఏ ఒక్కరిని మనం మంచి వారని కానీ, చెడ్డ వారని కానీ నిర్ణయించలేం కొంచెం పరిచయం అయిన తర్వాత  అతని శీల సంపత్తిని గమనించి  ప్రవర్తన ఎలా ఉంటుందో  తెలుసుకొని  ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు అని చెప్పగలుగుతాం అంతే తప్ప నా మనసు చెప్పింది వీడు చెడ్డవాడు అని చెబితే అది అహంకారానికి పరాకాష్ఠ.
మనకు యోగులు కనిపిస్తారు యోగము అంటే  కలిసి వచ్చేది  ఏది కలిసి వస్తుంది  తాను దేనిని సాధించ దలచుకున్నాడో దాని మీద కేంద్రీకరించి  సాధన చేసి  సొంతం చేసుకోవాలి. అతనికి భౌతికమైన ఈ ప్రాపంచిక సుఖాలపై  ఆశలు కోరికలు ఏమీ ఉండవు  అందరిలోనూ ఆ పరమాత్మ స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ చిరునవ్వుతో హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని   గడపడానికే నిర్ణయించుకుంటాడు. అలాంటి వాడిని చూసినప్పుడు  మామూలు వ్యక్తి కి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది. వారిని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు  ఏదో వేషం వేసుకొచ్చాడు  ప్రజలను మోసం చేసి  తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి  ఇది ఒక పన్నాగం కాబోలు అని ఆలోచిస్తాడు తప్ప వారి నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు  అది అతని అమాయకత్వం కావచ్చు లేదా మూర్ఖత్వము కావచ్చు. ఇంటి దగ్గర అమ్మ  చేసే పదార్థాలను  అమృతతుల్యం గాఉన్నవి నీ చేతికి అందిస్తే ఎంత కమ్మగా తింటావు  ఆ తినేటప్పుడు ఎంత ఆనందం అనుభవిస్తాం  ఈ ఆనందం ఎవరికి?  నీకా? నీ మనసుకా? నీ బుద్ధికా? దేనికో చెప్పగలవా  నీ చేతితో తీసుకుంటున్నావు నోటికి అందిస్తున్నావు తిన్న తర్వాత చాలా బావుంది అంటున్నావు ఆ జ్ఞానం ఎక్కడ నుంచి వచ్చింది  చేతికి తెలియదు  నోటికి తెలియదు నాలుకకు రుచి తెలుస్తుంది  దానిని మనసు వ్యక్తం చేస్తోంది  అలాగే ఇలాంటి యోగి అమృతము అని అనుకుంటే  వారి తత్వాన్ని అర్థం చేసుకుని  వారి మాటలలో, చేతలలో  ఏమైనా వ్యత్యాసం కనిపించినప్పుడు  మంచి చెడు నీ బుద్ధి నిర్ణయిస్తుంది  నీవు నీ మనసు కాదు  మానవుడు చంచలమైన మనసున్న వాడు నమ్మవలసిన శాశ్వతమైన బుద్ధిని ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం కోసమే వేమన అద్భుతమైన పోలికతో ఈ  ఆటవెలదిని మనకు అందించారు. ఒక్కసారి చదివితే  మీకు అర్థమవుతుంది. ఆ తత్వం  మీకోసం ఆ పద్యం
ఉర్వి జనులు పరమ యోగీశ్వరుని జూచి 
తెగడు వారె కాని తెలియలేరు అమృతపు రుచులన్ని హస్తమెట్లెరుగును...


కామెంట్‌లు