1. ప్రధాన పురుషార్థం ముక్తి!
చేరే ఏకైక మార్గం భక్తి!
కాయకం, వాచకం,
మానసికం!
పూజ, స్తోత్రం,అంతర్ముఖం!
బతుకమ్మ,దుర్గమ్మ,ఎల్లమ్మ!
ఎవరైనా మనం కొలిచే దైవం!
దుష్టశిక్షణ,శిష్టరక్షణ,ధ్యేయం!
అవతారాల పరమార్థం,
అసుర సంహారం!
2.నవరాత్రులు,
నవ ఆరాధనలు!
పార్వతి, లక్ష్మీ, సరస్వతి,
అమ్మ త్రిమూర్తిస్వరూపం!
ఇంటింటా బొమ్మలకొలువు!
కుటుంబ సభ్యులందరి,
సృజనకు నెలవు!
పదవరోజు,
విజయదశ(పున్న)మి!
దుర్గమ్మ మహిషాసుర మర్దనం!
రామన్న దశకంఠ సంహారం!
పాండవులు జమ్మిచెట్టునుంచి,
ఆయుధాల పునః స్వీకారం!
షిరిడిసాయి మహాసమాధి,
పుణ్యతిథి!
3."పిల్లలకి పప్పు బెల్లాలు,
అయ్యవారికి ఐదువరహాలు"
దసరా గొప్ప సరదా,
ఆనందానికి తీసిన పరదా!
మనిషి ఆసక్తి పెంచుకోవాలి,
శక్తి పుంజుకోవాలి!
సంస్కృతి, సంప్రదాయాల
దారి నడవాలి!
జగమంతా, జనమంతా,
ఆనందవిహారమే!
ఇది మన అందరి ప్రార్థన,
తప్పదు అమ్మ దీవెన!
--------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి