కోతిబావ - పనసపండు.; -డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

  ఉదయం నిద్రలేస్తునే రాత్రి దాచుకున్న పనస తొనలు తినసాగాడు కోతిబావ .
అప్పుడే వచ్చిన్న పిల్లరామచిలుక "బావకోతి పండు నేడు నువ్వేం తినబోతున్నావో " అన్నది.
మొదలు పెట్టావా నీతిక్కలభాషా పురాణం ఈరోజు పనసపండు తొనలు తేనెలో ముంచితింటున్నా ! ఇదిగో "అని తేనెలో ముంచిన పనసతొన పిల్లరామచిలుకకు అందించాడు కోతిబావ .
" ఏమిటి పండు పనస ప్రయోజనం వలన"అన్నది చిలుక.
" పనస ఒక పండ్ల చెట్టు.పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. పనసపండును కోసేప్పుడు చాకుకు, చేతులకు నూనె రాసుకోవడం వల్ల దాని జిగురు చేతులకు అంటదు. పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును . అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రుణధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం . పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి . మనప్రాంతములో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడుతారు . పనస పొట్టుతో ఆవపెట్టినచో ఉరగాయగా వాడవచ్చును . దీనిని సంస్కృతంలో “స్కంధఫలం” అని, హిందీలో “కటహక్‌-కటహర్‌-చక్కీ” అని, బంగ్లా‌లో “కాంటల్”‘ అని, మరాఠిలో “పణస” అని, ఆంగ్లంలో “ఇండియన్‌ జాక్‌ ఫ్రూట” అని‌ అంటారు.
వైద్య పరముగా : జీర్ణ శక్తిని మెరుగు పరచును, జారుడు గుణము కలిగివున్నందున మలబద్దకం నివారించును, పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గించును, విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును, ఫైటోన్యూట్రియంట్స్ , ఐసోఫ్లేవిన్స్  ఉన్నందున కాన్సర్ నివారణకు సహాయపడును . పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది. పొటాషియం మెండుగా లభించడం వల్ల అది రక్తపోటును తగ్గిస్తుంది. పనస ఆకులు, మొక్క జొన్న, కొబ్బరి చిప్పలను కాల్చి చేసిన పొడి పుండ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మవ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువును, టెన్షన్‌ను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునొప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినరాదు. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. పనస చెట్టు ఆకులతో విస్తర్లు కూడా కుడుతుంటారు. ఈ పండు విరేచనాన్ని బంధిస్తుంది. ఎక్కువగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను, ద్రాక్షా సారాయంలో నూరి పట్టు వేస్తే, దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు.
 ఈపనస పండులో పోషకాలు.
పిండి పదార్థాలు చక్కెరలు, పీచుపదార్థలు పుష్కలంగా ఉన్నాయి.
విటమిన్- a
విటమిన్- b 1
విటమిన్ b2
విటమిన్ b3
విటమిన్ b5
విటమిన్ బి 6
విటమిన్ b9
విటమిన్ సి
విటమిన్ ఇ
కాల్షియం ఐరన్ సోడియం పొటాషియం పాస్ఫరస్ మెగ్నీషియం మాంగనీస్ జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి "అన్నాడు కోతిబావ. 
" నువ్వు అధికారి అటవీశాఖ వద్ద నేర్చావు విషయాలు చాలా "అన్నది చిలుక. "అవును అటవీశాఖాధికారివద్ద చాలా విషయాలు, వాళ్ళపిల్లలతోపాటు చాలా భాషలు నేర్చాను "అన్నాడు కోతిబావ.
"అయితే నేర్పవా ఆభాషలు నాకు"అన్నది చిలుక.
" ముందు మనతల్లి భాష సరిగ్గా మాట్లాడు అప్పుడు ఇతరభాషలగురించి మాట్లాడదాం "అన్నాడుకోతి .
"ఏది తొన పనస మరోకటి రుచిగాఉంది ఇవ్వు "అన్నాది చిలుక.
"నీభాషమారదుగాక మారదు,ఇంద "అని తేనెలో ముంచిన పనసతొన చిలుకకు అందించాడు కోతిబావ.
 

కామెంట్‌లు